తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ioc Q1 Results: క్యూ 1 లో ఐఓసీ నికర లాభాలు 13 వేల కోట్లు

IOC Q1 results: క్యూ 1 లో ఐఓసీ నికర లాభాలు 13 వేల కోట్లు

HT Telugu Desk HT Telugu

28 July 2023, 18:00 IST

    • IOC Q1 results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) శుక్రవారం విడుదల చేసింది. ఈ క్యూ 1 లో ఐఓసీ రూ. 13,750.44 కోట్ల నికర లాభాలు ఆర్జించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Image: Bloomberg)

ప్రతీకాత్మక చిత్రం

IOC Q1 results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) శుక్రవారం విడుదల చేసింది. ఈ క్యూ 1 లో ఐఓసీ రూ. 13,750.44 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY23) లో సంస్థ ఆర్జించిన నికర లాభాల కన్నా ఇవి 36.7% ఎక్కువ. Q1FY23 లో ఐఓసీ నికర లాభాలు రూ. 10,058.69 కోట్లు.

ఆదాయం 2.21 లక్షల కోట్లు..

ఐఓసీ ఆపరేషన్స్ ఆదాయం ఈ క్యూ 1లో రూ. 2.21 లక్షల కోట్లు. గత త్రైమాసికం (Q4FY23) లో సంస్థ సాధించిన ఆదాయం కన్నా ఇది 2.36% తక్కువ. Q4FY23 ఐఓసీ ఆదాయం రూ. 2.26 లక్షల కోట్లు. అలాగే, Q1FY23 లో సంస్థ ఆపరేషన్స్ ఆదాయం రూ. 2.51 లక్షల కోట్లు. ఈ క్యూ 1 లో ఐఓసీ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ ఒక్క బ్యారెల్ పై 8.34 డాలర్లుగా ఉంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్ విలువ శుక్రవారం 0.10 తగ్గి 95.50 వద్ద ముగిసింది.

తదుపరి వ్యాసం