తెలుగు న్యూస్  /  బిజినెస్  /  India's First Lithium Find: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహన రంగానికి గుడ్ న్యూస్

India's first lithium find: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహన రంగానికి గుడ్ న్యూస్

HT Telugu Desk HT Telugu

10 February 2023, 17:12 IST

    • India's first lithium find: విద్యుత్ వాహనాల తయారీకి అత్యంత అవసరమైన ఖనిజం ఇప్పుడు భారత్ లో లభ్యమవనుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India's first lithium find: ఎలక్ట్రిక్ వాహనాల (electric vehicles EV) ఉత్పత్తిలో అత్యంత ముఖ్యమైనది అందులో ఉపయోగించే బ్యాటరీ. ఆ బ్యాటరీ తయారీకి అత్యంత అవసరమైనది లిథియం (lithium) ఖనిజం. ఆ ఖనిజాన్ని తాజాగా భారత్ లో గుర్తించారు. దాంతో భారత్ లోనే లిథియం వెలికితీత, ప్రాసెసింగ్ సాధ్యమవుతుంది. జమ్మూకశ్మీర్ లోని రియసి జిల్లాలో ఉన్న సలాల్ హాయిమన ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం (lithium) రిసోర్సెస్ ను జియొగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా (Geological Survey of India) గుర్తించింది.

ట్రెండింగ్ వార్తలు

Mahindra XUV 3XO bookings: రేపటి నుంచే మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ బుకింగ్స్ ప్రారంభం; ఇలా బుక్ చేసుకోండి..

Vivo X100 Ultra: ఇది ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసమే.. 200 ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో వివో ఎక్స్100 అల్ట్రా స్మార్ట్ ఫోన్

High dividend stocks: అదిరిపోయే డివిడెండ్ తో పాటు షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతున్న 5 స్టాక్స్ ఇవి..

Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

India's first lithium find: ఈవీల ఉత్తత్తికి బూస్ట్

భారత్ లో లిథియం (lithium) గనులను గుర్తించడం విద్యుత్ వాహన రంగంలో కీలక మలుపు. దీనివల్ల వాహన ఉత్పత్తి ఖరీదు తగ్గుతుంది. దాంతో, ఈవీల ఖరీదు కూడా గణనీయంగా తగ్గుతుంది. విశ్వం ఏర్పడడానికి కారణమైనదిగా భావిస్తున్న బిగ్ బ్యాంగ్ (Big Bang) జరిగిన సమయంలో ఉత్పత్తి అయిన వాటిలో లిథియం (lithium) ఒకటి. ఇది చాలా తేలికైన లోహం కూడా. ఇది నీటితో రియాక్షన్ జరిపి మాంసాన్ని కాల్చివేయతగ్గ తీవ్రతతో మంటను ఉత్పత్తి చేయగలదు.

India's first lithium find: ఈవీల బరువు గణనీయంగా తగ్గుతుంది

లిథియంను ముఖ్యంగా సిరామిక్, గ్లాస్, గ్రీజెస్, ఫార్మాస్యుటికల్ కాంపౌండ్స్, ఏసీలు, అల్యూమినియం ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. వీటన్నింటి కన్నా, శక్తిని ఎక్కువ మోతాదులో నిల్వచేసుకునే అద్భుత సామర్ధ్యం (highest energy storage capacity) కారణంగా బ్యాటరీల తయారీలో లిథియం (lithium) అత్యంత ముఖ్యమైన ముడి పదార్ధంగా మారింది. తక్కువ బరువుతో ఎక్కువ శక్తిని (energy storage capacity) నిల్వ చేసుకోగలదు కనుక విద్యుత్ వాహనాల్లో వాడే బ్యాటరీల్లో లిథియం (lithium) ను ఉపయోగిస్తారు. ఉదాహరణకు టెస్లా (Tesla car) కారులో లిథియం అయాన్ (lithium-ion battery) బ్యాటరీని వాడుతారు. ఆ బ్యాటరీ బరువు సుమారు 600 కేజీలుంటుంది. ఒకవేళ అదే టెస్లా కారు లిథియం ఆయాన్ బ్యాటరీని కాకుండా లెడ్ యాసిడ్ బ్యాటరీని (lead-acid battery) వాడాల్సి వస్తే, అప్పుడు ఆ బ్యాటరీ బరువు సుమారు 4 వేల కిలోలుంటుంది.

India's first lithium find: ఇండియాకు కూడా బూస్ట్

ఇప్పటివరకు లిథియంను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు భారత్ లోనే ఇది లభ్యమయ్యే అవకాశం లభించడంతో, ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి మంచి బూస్ట్ లభించనుంది. సంప్రదాయ లెడ్ యాసిడ్ (lead-acid battery) బ్యాటరీల కన్నా లిథియం అయాన్ (lithium-ion battery) బ్యాటరీల పనితీరు సమర్దవంతంగా ఉంటుంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ 10% వరకు వచ్చేవరకు కూడా లిథియం బ్యాటరీ (lithium-ion battery) ఫెయిల్ కాదు. అలాగే, ఈ బ్యాటరీలను కొన్ని వేల సార్లు రీఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. లిథియం (lithium) నిల్వల్లో అత్యధికం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాయి. చిలీ, బొలీవియా, అర్జెంటీనాల్లోనూ లిథియం (lithium) నిల్వలు అధికమే.

తదుపరి వ్యాసం