తెలుగు న్యూస్  /  బిజినెస్  /  World Cup 2023 : వరల్డ్​ కప్​తో ఇండియా 'ఎకానమీ' హిట్​.. వ్యాపారం మస్త్​గా జరిగింది!

World cup 2023 : వరల్డ్​ కప్​తో ఇండియా 'ఎకానమీ' హిట్​.. వ్యాపారం మస్త్​గా జరిగింది!

Sharath Chitturi HT Telugu

20 November 2023, 17:40 IST

    • World cup 2023 : 2023 వరల్డ్​ కప్​తో ఇండియా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడింది! ఈ రెండు నెలల పాటు అనేక వ్యాపారాలు దూసుకెళ్లాయి. ఎన్నడూ లేనంత లాభాలు చూశాయి!
వరల్డ్​ కప్​తో ఇండియా 'ఎకానమీ' హిట్​.. వ్యాపారం మస్త్​గా జరిగింది!
వరల్డ్​ కప్​తో ఇండియా 'ఎకానమీ' హిట్​.. వ్యాపారం మస్త్​గా జరిగింది! (REUTERS)

వరల్డ్​ కప్​తో ఇండియా 'ఎకానమీ' హిట్​.. వ్యాపారం మస్త్​గా జరిగింది!

World cup 2023 final : 2023 వరల్డ్​ కప్​ ఫైనల్​లో టీమిండియా ఓటమి.. అభిమానులను నిరాసపరిచింది. జట్టు ఓటమిపై చాలా మంది బాధపడ్డారు. ఇండియా కప్​ కొట్టలేదేమో కానీ.. ఈ వరల్డ్​ కప్​ పుణ్యమా అని.. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడిందనే చెప్పుకోవాలి! ఈ రెండు నెలల కాలంలో.. క్రికెట్​ చుట్టూ అల్లుకున్న వ్యాపారాలు జోరుగా సాగాయి.

ట్రెండింగ్ వార్తలు

CIBIL score for car loan: కారు లోన్ తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?.. సిబిల్ లేకపోతే ఎలా?

Gold price today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

Trading Guide: ఎన్టీపీసీ, వీ గార్డ్ సహా ఈ 8 స్టాక్స్ పై ఈ రోజు దృష్టి పెట్టండి

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

సీట్స్​ నుంచి టీవీ సేల్స్​ వరకు..

ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్​కి ముందు.. దేశవ్యాప్తంగా స్వీట్లు భారీగా అమ్ముడుపోయాయి. ఫలితంగా.. షుగర్​ సేల్స్​ పెరిగాయి. ఐస్​ క్రీమ్​ తయారీకి ఉపయోగించే పాల ఉత్పత్తులు, నట్స్​, డ్రై ఫ్రూట్స్​ సేల్స్​ కూడా బాగా జరిగాయి. ఇండియా విక్టరీని సెలబ్రేట్​ చేసుకునేందుకు చాలా మంది వీటిని కొనుగోలు చేశారు.

వరల్డ్​ కప్​ పుణ్యమా అని.. మ్యాచ్​లు జరిగిన ప్రతి స్టేడియానికి కొత్తగా పెయింట్స్​ వేశారు. ఫర్నీచర్​, సీట్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా.. వర్కర్స్​, కాంట్రాక్టర్స్​కి పని లభించింది. పెయింట్​ బిజినెస్​ బాగా జరిగింది.

India vs Australia World cup final : ఇక 2023 వరల్డ్​ కప్​ నేపథ్యంలో దేశవ్యాప్తంగా.. రెస్టారెంట్లు కళకళలాడిపోయాయి. చాలా మంది.. ఇళ్లకు ఫుడ్​ని డెలివరీలు చేసుకోగా.. ఇంకొంతమంది, తన స్మేహితులు- కుటుంబసభ్యులతో కలిసి డైనింగ్​ చేశారు. వ్యాపారం బాగా సాగింది.

ఇక మ్యాచ్​లు జరిగిన నగరాల్లో హోటల్స్​ రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. విమానలు రేట్లు కూడా పెరిగాయి.

మరోవైపు ఫైనల్​ మినహాయిస్తే.. ఈ వరల్డ్​ కప్​లో టీమిండియా ఒక్క మ్యాచ్​ కూడా ఓడిపోలేదు. ఫలితంగా.. టీమిండియా జెర్సీలు విపరీతంగా అమ్ముడుపోయాయి. టీవీ సేల్స్​ పెరిగాయి. చాలా మంది చిన్న టీవీల నుంచి పెద్ద టీవీలకు అప్​గ్రేడ్​ అయ్యారు. రీటైలర్స్​, కార్గో షిప్పింగ్​, డెలివరీ ఏజెంట్స్​, టెక్నీషియన్స్​కి పని దొరికింది.

పైన చెప్పిన వాటన్నింటికీ.. బ్యాంక్​లు లోన్​లు ఇచ్చాయి. చాలా మంది ఈఎంఐల్లోనే టీవీలు కొన్నారు. ఫలితంగా.. బ్యాంక్​లకు కూడా వ్యాపారం బాగా జరిగినట్టే!

2023 World cup India economy : టెలికామ్​ ఆపరేట్స్​కు వరల్డ్​ కప్​ వల్ల జోష్​ వచ్చింది. చాలా మంది తమ ఫోన్స్​లో మ్యాచ్​లను చూడటం వల్ల డేటా ట్రాఫిక్​ బీభత్సంగా పెరిగింది. అదే సమయంలో రౌటర్​, ఆప్టికల్​ ఫైబర్​కి కూడా డిమాండ్​ పెరిగింది.

దేశవ్యాప్తంగా బిజినెస్​ జోరుగా సాగడం, అదే సమయంలో పండుగ సీజన్​ కూడా రావడంతో.. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా తయారైందని నిపుణులు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం