తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Fd Rates Hike : గుడ్‍న్యూస్ చెప్పిన హెచ్‍డీఎఫ్‍సీ.. ఎఫ్‍డీ రేట్ల పెంపు.. ఎస్‍బీఐతో పోలిస్తే..

HDFC FD Rates Hike : గుడ్‍న్యూస్ చెప్పిన హెచ్‍డీఎఫ్‍సీ.. ఎఫ్‍డీ రేట్ల పెంపు.. ఎస్‍బీఐతో పోలిస్తే..

22 February 2023, 11:16 IST

    • HDFC FD Interest Rates Hike: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed Deposits) వడ్డీ రేటును హెచ్‍డీఎఫ్‍సీ అధికం చేసింది. వివిధ కాలపరిమితుల (Tenure) ఎఫ్‍డీలపై వడ్డీ రేటును సవరించింది. పూర్తి వివరాలివే..
HDFC FD Rates Hike: గుడ్‍న్యూస్ చెప్పిన హెచ్‍డీఎఫ్‍సీ.. ఎఫ్‍డీ రేట్ల పెంపు
HDFC FD Rates Hike: గుడ్‍న్యూస్ చెప్పిన హెచ్‍డీఎఫ్‍సీ.. ఎఫ్‍డీ రేట్ల పెంపు (Mint Photo)

HDFC FD Rates Hike: గుడ్‍న్యూస్ చెప్పిన హెచ్‍డీఎఫ్‍సీ.. ఎఫ్‍డీ రేట్ల పెంపు

HDFC FD Interest Rates Hike: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‍డీఎఫ్‍సీ (HDFC) తీపికబురు చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Fixed Deposits - FD)పై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2కోట్ల కంటే తక్కువగా ఉన్న వివిధ కాలపరిమితుల (Tenure) ఎఫ్‍డీలపై వడ్డీ రేటును అధికం చేసింది. దీంతో ఎఫ్‍డీలో పెట్టుబడి పెట్టిన వారికి మరింత ఎక్కువ మొత్తం రానుంది. తాజా పెంపుతో హెచ్‍డీఎఫ్‍సీ ఎఫ్‍‍డీ వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 7.10 శాతం మధ్య ఉన్నాయి. సీనియర్ సిటిజన్‍లకు 3.50 శాతం నుంచి 7.60 శాతం మధ్య ఉన్నాయి. వివిధ కాలపరిమితులకు (Tenure) హెచ్‍డీఎఫ్‍సీ తాజా ఎఫ్‍డీ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

HDFC Latest FD Interest Rates: హెచ్‍డీఎఫ్‍సీ తాజా ఎఫ్‍డీ వడ్డీ రేట్లు ఇలా..

  • 7 నుంచి 14 రోజులు - 3 శాతం
  • 15 నుంచి 29 రోజులు - 3 శాతం
  • 30 నుంచి 45 రోజులు - 3.50 శాతం
  • 46 నుంచి 60 రోజులు - 4.50 శాతం
  • 61 నుంచి 89 రోజులు - 4.50 శాతం
  • 90 రోజుల నుంచి 6 నెలలలోపు (<) - 4.50 శాతం
  • 6 నెలల 1 రోజు నుంచి 9 నెలలోపు - 5.75 శాతం
  • 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరంలోపు (<) - 6 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలలలోపు (<) - 6.60 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలలలోపు - 7.10 శాతం
  • 18 నెలల నుంచి 21 నెలలోపు - 7 శాతం
  • 21 నెలల నుంచి 2 సంత్సరాలు - 7 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంత్సరాలు - 7 శాతం
  • 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాలు - 7 శాతం
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు - 7 శాతం

సీనియర్ సిటిజన్లకు ఎఫ్‍డీలపై 0.50 శాతం (అర శాతం) అదనపు వడ్డీ లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 21వ తేదీ నుంచి వర్తిస్తాయని హెచ్‍డీఎఫ్‍సీ ప్రకటించింది.

ఎస్‍బీఐ ఎఫ్‍డీ (Fixed Deposit - FD) వడ్డీ రేట్లు ఇలా..

SBI FD Interest Rates: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఇటీవలే ఎఫ్‍డీలపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితుల (Tenure) ఎఫ్‍డీలపై వడ్డీని అధికం చేసింది.

  • 7 రోజుల నుంచి 45 రోజులు - 3 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజులు - 4.50 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజులు - 5.25 శాతం
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు - 5.75 శాతం
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపు - 6.80 శాతం
  • 400 రోజులు (అమృత్ కలశ్ ప్రత్యేక పథకం) - 7.10 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలోపు - 7 శాతం
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలోపు - 6.50 శాతం
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలోపు - 6.50 శాతం

సీనియర్ సిటిజన్లకు ఎస్‍బీఐలోనూ అర శాతం ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. 60 ఏళ్ల వయసుపైబడిన వారిని సీనియర్ సిటిజన్లుగా బ్యాంకులు పరిగణిస్తాయి.

తదుపరి వ్యాసం