తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Bank Hikes Fd Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

HDFC Bank hikes FD rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ

HT Telugu Desk HT Telugu

12 October 2022, 15:18 IST

    • HDFC Bank hikes FD rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.75 శాతం మేర వడ్డీ రేట్లు పెంచింది
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.75 శాతం మేర వడ్డీ రేట్లు పెంచింది (MINT_PRINT)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.75 శాతం మేర వడ్డీ రేట్లు పెంచింది

రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లు పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు అక్టోబరు 11 నుంచి అమల్లోకి వస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్లు.. అంటే 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు పెంచింది.

7 నుంచి 10 సంవత్సరాల మధ్య డిపాజిట్లపై ఇన్వెస్టర్లు ఇప్పుడు 3 శాతం నుంచి 6 శాతం వరకు వడ్డీ రేటు పొందుతారు. సీనియర్ సిటిజెన్లయితే 3.50 శాతం 6.75 శాతం వరకు వడ్డీ రేట్లు పొందుతారు.

HDFC Bank FD Rates: వడ్డీ రేట్ల పెంపు ఇలా..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7 నుంచి 29 రోజుల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచింది.

అలాగే 30 రోజుల నుంచి 60 రోజుల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25 శాతం నుంచి 3.50 శాతానికి పెంచింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 61 రోజుల నుంచి 89 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 4 శాతానికి పెంచింది. ఇప్పటి వరకు 3.25 శాతంగా ఉండేది.

ఇక 90 రోజుల నుంచి 6 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను 4.25 శాతానికి పెంచింది. ఇప్పటి వరకు వీటిపై 3.75 శాతం ఉండేది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6 నెలల నుంచి ఏడాది లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.65 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడాది నుంచి 2 ఏళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5.50 శాతం నుంచి 5.70 శాతానికి పెంచింది. ఇక రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య డిపాజిట్లకు 5.50 శాతం నుంచి 5.80 శాతానికి పెంచింది.

మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు వడ్డీ రేటు 6.10 శాతంగా కొనసాగుతుంది. అయితే ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు వడ్డీ రేటు 6 శాతం లభిస్తుంది. ఇప్పటివరకు వీటిపై 5.75 శాతంగా ఉండేది.

<p>HDFC Bank FD Rates: పెరిగిన వడ్డీ రేట్లు</p>

HDFC Bank RD Rates: రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ) పై కూడా వర్డీ రేట్లు పెంచింది. 6 నుంచి 36 నెలలకు మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లకు, అలాగే 90 నెలల నుంచి 120 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లు సవరించింది. వీటికి సాధారణ ప్రజలకైతే 4.25 శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజెన్లయితే 4.75 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీ రేటు వర్తిస్తుంది.

<p>HDFC Bank RD Rates: రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు</p>
తదుపరి వ్యాసం