తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Flipkart Vs Amazon Sale: అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ సేల్స్ ప్రారంభం: తేదీలు, ఆఫర్ల వివరాలివే

Flipkart vs Amazon Sale: అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ సేల్స్ ప్రారంభం: తేదీలు, ఆఫర్ల వివరాలివే

04 May 2023, 15:01 IST

    • Flipkart Sale vs Amazon Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ డేస్ సేల్, ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నేడు (మే 4) ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్ ఎప్పటి వరకు ఉండనున్నాయి, ఆఫర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
Flipkart vs Amazon Sale: అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ సేల్స్ ప్రారంభం: తేదీలు, ఆఫర్ల వివరాలివే (HT Photo)
Flipkart vs Amazon Sale: అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ సేల్స్ ప్రారంభం: తేదీలు, ఆఫర్ల వివరాలివే (HT Photo)

Flipkart vs Amazon Sale: అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ సేల్స్ ప్రారంభం: తేదీలు, ఆఫర్ల వివరాలివే (HT Photo)

Flipkart Sale vs Amazon Sale: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్‍లు అమెజాన్, ఫ్లిప్‍కార్ట్‌ల్లో నేడు (మే 4) సేల్‍లు మొదలయ్యాయి. అమెజాన్‍లో గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale), ఫ్లిప్‍కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‍లలో మొబైళ్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లు, స్మార్ట్ వాచ్‍లు సహా దాదాపు చాలా ప్రొడక్టులు ఆఫర్లతో లభిస్తున్నాయి. బ్యాంక్ కార్డు ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కాగా, ఈ రెండు సేల్స్ తేదీలు, బ్యాంక్ కార్డు ఆఫర్లు, కొన్ని డిస్కౌంట్ల వివరాలు ఇవే.

Flipkart vs Amazon Sale: తేదీలు ఇవే

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నేటి (మే 4) మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. ఈ నెల 8వ తేదీ వరకు సేల్ కొనసాగనుంది. అంటే ఈ సేల్ ఐదు రోజులు పాటు ఉంటుంది. ఇక ఫ్లిప్‍కార్ట్ గ్రేట్ సమ్మర్ సేల్ కూడా నేటి మధ్యాహ్నం మొదలైంది. ఈ సేల్ ఏడు రోజుల పాటు అంటే మే 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ప్లస్ మెంబర్లకు ఫ్లిప్‍కార్ట్‌లో, ప్రైమ్ మెంబర్లకు అమెజాన్‍లో బుధవారమే సేల్ మొదలైంది. నేడు ఈ సేల్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాయి.

Flipkart Sale vs Amazon Sale: బ్యాంక్ కార్డ్ ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‍లో కొటాక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి. ఈ బ్యాంక్ కార్డులతో కొంటే 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ప్రొడక్టు ధరను బట్టి ఆఫర్ మొత్తం మరే ఛాన్స్ ఉంటుంది. ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో ఎస్‍బీఐ క్రెడిట్ కార్డుపై ఆఫర్ ఉంది. ఈ సేల్‍లో ఎస్‍బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కార్డు ఆఫర్ పొందేందుకు మినిమమ్ ట్రాన్సాక్షన్ వాల్యూ ప్రొడక్టులను బట్టి విభిన్నంగా ఉంటుంది. పేటీఎం వ్యాలెట్ ఆఫర్లు కూడా కొన్ని ప్రొడక్టులపై ఉన్నాయి.

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‍కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‍లో ఐఫోన్ 13 సిరీస్, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ, నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 6ఏ, రియల్‍మీ 10 ప్రో 5జీ సిరీస్ సహా చాలా పాపులర్ మొబైళ్లు డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్‍టాప్‍లపై 40 శాతం వరకు, స్మార్ట్ వాచ్‍లపై 80 శాతం వరకు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు లాంటి హోం అప్లియన్సెస్‍పై 60 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి.

Amazon Great Summer Sale: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‍లో ఐఫోన్ 14 సిరీస్ మొబైళ్లపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. వన్‍ప్లస్ 10ఆర్ 5జీ, ఐకూ జెడ్5, ఐకూ నియో 6 5జీ, ఐకూ నియో 7 5జీ, రెడ్‍మీ కే50ఐ 5జీ, సామ్‍సంగ్ గెలాక్సీ ఎం33 5జీపై మంచి డీల్స్ ఉన్నాయి. అలాగే వన్‍ప్లస్, సామ్‍సంగ్, రియల్‍మీ, రెడ్‍మీ, వివో, ఒప్పో సహా దాదాపు అన్ని బ్రాండ్‍ల ఫోన్లపై ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ వాచ్‍లపై 70 శాతం వరకు, హోమ్ అప్లియన్సెస్‍పై 60 శాతం వరకు, స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు, ల్యాప్‍టాప్‍లపై 40 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం