తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Divi's Labs Q4 Results: డివిస్ ల్యాబ్స్ లాభాల్లో భారీ క్షీణత; రూ. 30 డివిడెండ్

Divi's Labs Q4 results: డివిస్ ల్యాబ్స్ లాభాల్లో భారీ క్షీణత; రూ. 30 డివిడెండ్

HT Telugu Desk HT Telugu

20 May 2023, 18:49 IST

    • Divi's Labs Q4 results: ప్రముఖ ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబ్స్ 2022-23 ఆర్థిక సంవత్సరం Q4 ఫలితాలను శనివారం ప్రకటించింది. Q4FY23 లో దివిస్ ల్యాబ్స్ రూ. 320.97 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం లో ఆర్జించిన రూ. 894.64 కోట్ల నికర లాభాల కన్నా ఏకంగా 64.1% తక్కువ.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

ప్రతీకాత్మక చిత్రం

Divi's Labs Q4 results: ప్రముఖ ఫార్మా కంపెనీ దివిస్ ల్యాబ్స్ 2022-23 ఆర్థిక సంవత్సరం Q4 ఫలితాలను శనివారం ప్రకటించింది. Q4FY23 లో దివిస్ ల్యాబ్స్ రూ. 320.97 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY22) లో ఆర్జించిన రూ. 894.64 కోట్ల నికర లాభాల కన్నా ఏకంగా 64.1% తక్కువ.

Divi's Labs Q4 results: 1500% డివిడెండ్

లాభాల్లో భారీ క్షీణత నమోదైనప్పటికీ.. షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 30ల ఫైనల్ డివిడెండ్ ను దివిస్ ల్యాబ్స్ ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్ పై ఈ డివిడెండ్ 1500% అవుతుంది. Q4FY23 లో దివిస్ ల్యాబ్స్ మొత్తం ఆదాయం రూ. 1,950.8 కోట్లు. ఇది Q4FY22 లో ఈ ఫార్మా సంస్థ సాధించిన రూ. 2,518.4 కోట్ల ఆదాయం కన్నా 22.5% తక్కువ. Q4FY23 లో దివిస్ ల్యాబ్స్ రూ. 3 కోట్ల ఫారిన్ ఎక్స్ చేంజ్ ను నష్టపోయింది. Q4FY22 లో సంస్థ రూ. 29 కోట్ల ఫారిన్ ఎక్స్ చేంజ్ ను లాభంగా పొందింది.

Divi's Labs Q4 results: మొత్తం ఆర్థిక సంవత్సరంలో..

మొత్తం 2022-23 ఆర్థిక సంవత్సరంలో దివిస్ ల్యాబ్స్ రూ. 8112 కోట్ల ఆదాయం సముపార్జించింది. అదే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దివిస్ ల్యాబ్స్ మొత్తం ఆదాయం రూ. 9074 కోట్లు. అంటే, FY22 కన్నా FY23 లో దివిస్ ల్యాబ్స్ 11% తక్కువ ఆదాయం సముపార్జించగలిగింది. శుక్రవారం దివిస్ ల్యాబ్స్ షేర్ విలువ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో, అంతకుముందు రోజు కన్నా రూ. 58.55 తక్కువగా.. రూ. 3097.75 వద్ద ముగిసింది.

తదుపరి వ్యాసం