తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today: డే ట్రేడింగ్ గైడ్.. ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ లిస్ట్

Stocks to buy Today: డే ట్రేడింగ్ గైడ్.. ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్ లిస్ట్

24 November 2022, 8:28 IST

    • Stocks to buy Today: డే ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ జాబితాను నిపుణులు పేర్కొన్నారు. నేటి స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే.
Stocks to buy Today: డే ట్రేడింగ్ గైడ్.. ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్
Stocks to buy Today: డే ట్రేడింగ్ గైడ్.. ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్

Stocks to buy Today: డే ట్రేడింగ్ గైడ్.. ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్

Stocks to buy Today November 24: బ్యాంకింగ్ సెక్టార్ జోరు కనబరచడంతో బుధవారం భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. 91.62 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ 61,510.58 వద్దకు చేరింది. దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 23.05 పాయింట్లు పెరిగి 18,267.25 పాయింట్ల వద్ద స్థిరపడింది.

మరోవైపు నేడు (నవంబర్ 24) భారత మార్కెట్లు సానుకూలంగానే మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. ఎస్‍‍జీఎక్స్ నిఫ్టీ గ్రీన్‍లోనే ఉంది. అమెరికా, ఆసియా మార్కెట్లు కూడా పాజిటివ్‍గా ఉన్నాయి.

మార్క్ దాటితే నిఫ్టీ మరింత పైకి..

“వీక్లీ లాంటి లాంగ్ టర్మ్ చార్టులను బట్టి చూస్తే నిఫ్టీ ఇప్పటికీ అప్‍ట్రెండ్ స్థితిలోనే ఉంది. ఒకవేళ ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతున్నా, మార్కెట్‍లో బలహీనత వచ్చినా దాన్ని కొనుగోలు అవకాశంగా పరిగణించవచ్చు. 18,100-18,000 లెవెల్స్ వద్ద సపోర్ట్ లభించేంత వరకు పాజిటివ్‍గానే చూడొచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్లు తటస్థంగా ఉండొచ్చని అంచనా. ఒకవేళ నిఫ్టీ 18,400 పాయింట్ల మార్కును దాటితే 18,600+ కు చేరి జీవితకాల గరిష్ఠానికి వెళే అవకాశం ఉంటుంది” అని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ విశ్లేషకులు నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు.

స్టాక్స్ టు బై టుడే

ట్రేడింగ్ చేసే వారు నేడు ఈ స్టాక్స్ పై దృష్టి సారిస్తే ఫలితాలు ఉండొచ్చు.

ఎంసీఎక్స్: ప్రస్తుత మార్కెట్ ప్రైజ్‍కు కొనాలి (బై కరెంట్ మార్కెట్ ప్రైజ్), టార్గెట్: 1,600 , స్టాప్ లాస్: 1,504

ఫెడరల్ బ్యాంక్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.139 , స్టాప్ లాస్: రూ.131

హెచ్‍డీఎఫ్‍సీ లైఫ్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.560-565, స్టాప్ లాస్: రూ.539

డాక్టర్ రెడ్డీస్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.4,500-4,540, స్టాప్ లాస్: రూ.4,350

అపోలో హాస్పిటల్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.4,660, స్టాప్ లాస్: రూ.4,570

బీపీసీఎల్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.317, స్టాప్ లాస్: రూ.306

టైటాన్: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.2,640, స్టాప్ లాస్: రూ.2,565

ఎస్‍బీఐ: బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, టార్గెట్: రూ.635, స్టాప్ లాస్: రూ.594

(గమనిక:- ఇవి నిపుణులు తెలిపిన అభిప్రాయలు మాత్రమే. ఇది సమాచారం, అవగాహన కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం, రీసెర్చ్ చేయడం శ్రేయస్కరం.)​

తదుపరి వ్యాసం