తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top Dividend Stocks: భారీగా డివిడెండ్ ను అందించే టాప్ 10 స్టాక్స్ ఇవే..

Top dividend stocks: భారీగా డివిడెండ్ ను అందించే టాప్ 10 స్టాక్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu

06 September 2023, 12:49 IST

  • Top dividend stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు ఇన్వెస్టర్లు కంపెనీ ఫండమెంటల్స్, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తో పాటు ఆయా సంస్థలు ఇచ్చే డివిడెండ్ ను పరిగణనలోకి తీసుకుంటారు. రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ టాప్ 10 డివిడెండ్ స్టాక్స్ ను లిస్ట్ ఔట్ చేసింది. ఆ వివరాలు చూడండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Top dividend stocks: రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ రూపొందించిన మంచి డివిడెండ్ అందించే ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో కోల్ ఇండియా (Coal India), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL), ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ కూడా ఉన్నాయి. డివిడెండ్ మొత్తాన్నే కాకుండా, సంస్థ ఫండమెంటల్స్ ను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించామని రెలిగేర్ బ్రోకింగ్ వెల్లడించింది.

top 10 dividend-yield stocks: టాప్ 10 స్టాక్స్

  1. కోల్ ఇండియా

10.9% డివిడెండ్ తో ఈ జాబితాలో కోల్ ఇండియా తొలి స్థానంలో ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా డీపీఎస్ (Dividend per share) రూ. 17 కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 24.30 గా ఉంది. కోల్ ఇండియా సీఎంపీ ఇప్పుడు రూ. 255 గా ఉంది.

2) సెయిల్

సెయిల్ సీఎంపీ ఇప్పుడు రూ. 101 గా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 2.80, 2022 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 8.80 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది. మొత్తంగా సెయిల్ అందించే డివిడెండ్ శాతం 9.6%.

3) ఆయిల్ ఇండియా

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా ప్రస్తుత షేర్ ధర రూ. 280 గా ఉంది. ఈ సంస్థ డివిడెండ్ శాతం 7.3% గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 14.30, 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 20.00 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది.

4) ఓఎన్జీసీ

ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ప్రస్తుత షేర్ ధర రూ. 183 గా ఉంది. ఈ సంస్థ డివిడెండ్ శాతం 6.5% గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 10.50, 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 11 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది.

5) పవర్ గ్రిడ్ కార్పొరేషన్

ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రస్తుత షేర్ ధర రూ. 254 గా ఉంది. ఈ సంస్థ డివిడెండ్ శాతం 6.0% గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 14.80, 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 14.8 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది.

6) పీటీసీ ఇండియా

పీటీసీ ఇండియా ప్రస్తుత షేర్ ధర రూ. 150 గా ఉంది. ఈ సంస్థ డివిడెండ్ శాతం 5.6% గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 7.80, 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 7.8 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది.

7) ఎన్ఎండీసీ

నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) ప్రస్తుత షేర్ ధర రూ. 143 గా ఉంది. ఈ సంస్థ డివిడెండ్ శాతం 5.4% గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 14.70, 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 6.60 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది.

8) ఆర్ఈసీ

రీజనల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) ప్రస్తుత షేర్ ధర రూ. 240 గా ఉంది. ఈ సంస్థ డివిడెండ్ శాతం 5.3% గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 15.30, 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 12.60 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది.

9) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) ప్రస్తుత షేర్ ధర రూ. 262 గా ఉంది. ఈ సంస్థ డివిడెండ్ శాతం 5.1% గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 12.00, 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 13.30 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది.

10) నేషనల్ అల్యూమినియం కంపెనీ

నేషనల్ అల్యూమినియం కంపెనీ (NAlCo) ప్రస్తుత షేర్ ధర రూ. 102 గా ఉంది. ఈ సంస్థ డివిడెండ్ శాతం 4.8% గా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఒక్క షేరుపై రూ. 6.05, 2023 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ. 4.5 డివిడెండ్ ను ఈ సంస్థ అందించింది.

తదుపరి వ్యాసం