తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Onion Price In Hyderabad : మండుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు!

Onion price in Hyderabad : మండుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు!

Sharath Chitturi HT Telugu

31 October 2023, 6:39 IST

    • Onion price in Hyderabad : పెరుగుతున్న ఉల్లిగడ్డల ధరలు చూసి ప్రజలు భయపడిపోతున్నారు. ధరలను తగ్గించేందుకు.. కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది.
మండుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు!
మండుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు!

మండుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు!

Onion price in Hyderabad : దేశవ్యాప్తంగా భగభగలాడుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం పలు కీలక చర్యలు చేపట్టింది. రిజర్వులో ఉన్న స్టాక్​ను సరఫరా చేసి ధరలను తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఉల్లిపాయల పంపిణీని మొదలుపెట్టింది.

భగభగలాడుతున్న ఉల్లి ధరలు..

ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడటం, పండుగ సీజన్​తో డిమాండ్​ పెరగడంతో.. ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. అనేక రాష్ట్రాల్లో.. 14 రోజుల వ్యవధిలో వీటి ధరలు రెట్టింపు అయ్యాయి. ఇక దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఇళ్లు, రెస్టారెంట్లలో ఉల్లి వాడకం మరింత పెరుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. రిజర్వు స్టాక్​ని వదలడం మొదలుపెట్టింది.

"దేశంలోని 16 నగరాల్లో ఉల్లిగడ్డలను కేంద్రం సరఫరా చేస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గేంత వరకు ఈ చర్యలు తీసుకుంటుంది," అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

Onion price India : దేశ రాజధాని దిల్లీలోని రీటైల్​ మార్కెట్​లలో.. రెండు వారాల క్రితం రూ. 30గా ఉన్న కేజీ ఉల్లిగడ్డ.. ఇప్పుడు ఏకంగా రూ. 80 పలుకుతోంది. కోల్​కతా, హైదరాబాద్​, కాన్పూర్​ వంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.

జూన్​- సెప్టెంబర్​ రుతుపవనాల సీజన్​లో లోటు వర్షపాతం నమోదవ్వడం.. ఉల్లిగడ్డ ధరల రెక్కలకు ప్రధాన కారణం. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో.. మహారాష్ట్ర, కర్ణాటకలోని ఖరీఫ్​ ఉల్లి పంటలు నాశనమయ్యాయి. దేశంలో ఉల్లిగడ్డను అధికంగా పండించే రాష్ట్రాలు ఇవే కావడంతో, సరఫరా లేక ధరలు పెరిగిపోతున్నాయి.

Onion prices today : మరోవైపు ఉల్లిగడ్డ ఎగుమతులపై ఈ నెల 28న ఆంక్షలు విధించింది కేంద్రం. ఎంఈపీ (గరిష్ఠ ఎగుమతి ధర)ని 800 డాలర్లుగా ప్రకటించింది. ఆ తర్వాత.. మహారాష్ట్ర మార్కెట్​లలో ఉల్లిగడ్డ ధరలు 5శాతం వరకు దిగొచ్చినట్టు సమాచారం.

ఎంఈపీ కన్నా తక్కువ ధరకు ఎగుమతి చేయకూడదు. ఫలితంగా.. ఎగుమతి గిట్టుబాటు కాకపోవడంతో దేశీయంగా విక్రయించేందుకు రైతులు ముందుకొస్తే, తద్వారా ధరలు మరింత తగ్గుతాయి.

"ఉల్లిగడ్డలు మాత్రమే కాదు. ఆకు కూరలు, గుమ్మడి, అరటి పండ్ల ధరలు కూడా వారం రోజుల వ్యవధిలో భారీగా పెరిగిపోయాయి," అని దిల్లీ ఆధారిత ట్రేడర్లు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం