తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jan Aushadhi Kendra: జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

Jan Aushadhi Kendra: జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

HT Telugu Desk HT Telugu

12 January 2023, 21:36 IST

  • చవకగా ఔషధాలను అందించే జన ఔషధి కేంద్రాలను (Jan Aushadhi Kendra) దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి కేంద్రం చర్యలు చేపడ్తోంది. అందులో భాగంగా ఆ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jan Aushadhi Kendra: చవగా ఔషధాలను అందించే జన ఔషధి కేంద్రా (Jan Aushadhi Kendra) లను కొత్తగా ఏర్పాటు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 651 జిల్లాల్లో ఈ జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కేంద్ర ఫార్మా విభాగం, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ ఈ జన ఔషధి కేంద్రా (Jan Aushadhi Kendra) లను సంబంధించిన ‘‘ప్రధానమంత్రి భారతీయ జనఔషధ పరియోజన (Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana PMBJP)’’ను ప్రారంభించింది. ఫార్మాస్యుటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరొ ఆఫ్ ఇండియా (Pharmaceuticals and Medical Devices Bureau of India PMBI) దీని నిర్వహణ భాద్యతలను చూస్తుంది. కొత్తగా జన ఔషధి కేంద్రా (Jan Aushadhi Kendra) లను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

New Jan Aushadhi Kendra: 9000 కేంద్రాలు

‘‘ప్రధానమంత్రి భారతీయ జనఔషధ పరియోజన (Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana PMBJP)’’ పథకం కింద దేశవ్యాప్తంగా 9 వేల జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ తరువాత, మార్చి 2024 నాటికి ఆ కేంద్రాల సంఖ్యను 10 వేలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ జన ఔషధి కేంద్రాల్లో (Jan Aushadhi Kendra) 1759 ఔషధాలు(medicines), 280 సర్జికల్ డివైజెస్ (surgical devices) లభిస్తాయి. దాదాపు అన్ని రకాల వ్యాధులు, సమస్యలకు చవకైన ధరలో నాణ్యమైన ఔషధాలు ఈ జన ఔషధ కేంద్రాల్లో లభించేలా చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఈ జన ఔషధ కేంద్రాలను ప్రారంభించాలనుకునే వారు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 651 జిల్లాల్లో కొత్తగా ఈ జన ఔషధి కేంద్రా (Jan Aushadhi Kendra) లను ఏర్పాటు చేయనున్నారు.

self employment: స్వయం ఉపాధి

పేదలు, మధ్యతరగతి సహా ప్రజలందరికీ చవకగా నాణ్యమైన ఔషధాలను అందించే లక్ష్యంతో ఈ ‘‘ప్రధానమంత్రి భారతీయ జనఔషధ పరియోజన (Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana PMBJP)’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే, నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి అవకాశంగా, మంచి ఆదాయ మార్గంగా కూడా ఈ పథకం ఉంటుంది. ఈ పథకం కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గా రూ. 5 లక్షలు ఇస్తారు. అలాగే, రూ. 2 లక్షలను ఐటీ, ఇన్ఫ్రా వసతులను సమకూర్చుకోవడం పెట్టిన ఖర్చుల కోసం ఇస్తారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, నీతి ఆయోగ్ నిర్ధారించిన జిల్లాలు, ద్వీప ప్రాంతాలు, మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు ప్రారంభించే జన ఔషధి కేంద్రాలకు (Jan Aushadhi Kendra) ఈ ఇన్సెంటివ్స్ వర్తిస్తాయి.

తదుపరి వ్యాసం