తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bharti Airtel Q4 Result: ఎయిర్ టెల్ లాభాల్లో 50 శాతం వృద్ధి; డివిడెండ్ ప్రకటన

Bharti Airtel Q4 result: ఎయిర్ టెల్ లాభాల్లో 50 శాతం వృద్ధి; డివిడెండ్ ప్రకటన

HT Telugu Desk HT Telugu

16 May 2023, 19:13 IST

  • Bharti Airtel Q4 result: 2022 -23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను భారతి ఎయిర్ టెల్ మంగళవారం ప్రకటించింది. భారత టెలీకాం దిగ్గజ సంస్థ భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) నికర లాభాల్లో ఈ Q4 లో 50% వృద్ధి నమోదైంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bharti Airtel Q4 result: భారత టెలీకాం దిగ్గజ సంస్థ భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) Q4FY23 లో రూ. 3,006 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. Q4FY22 లో ఎయిర్ టెల్ నికర లాభాలు రూ. 2,008 కోట్లు. ఎయిర్ టెల్ (Bharti Airtel) Q4FY23 లో Q3FY23 తో పోలిస్తే, నికర లాభాల్లో 89% వృద్ధిని సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

Bharti Airtel Q4 result: రూ. 4 డివిడెండ్

Q4FY23 ఫలితాలతో పాటు తమ షేర్ హోల్డర్లకు భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) ఫైనల్ డివిడెండ్ కూడా ప్రకటించింది. రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ (fully paid-up equity share) పై రూ. 4 డివిడెండ్ గా ఇవ్వాలని నిర్ణయించింది. రూ. 5 ముఖ విలువ కలిగిన ఒక్కో పార్ట్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ (fully paid-up equity share) పై రూ. 1 డివిడెండ్ గా ఇవ్వనుంది.

Bharti Airtel Q4 result: ఆదాయం కూడా..

Q4FY23 లో భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) ఆపరేషన్స్ ఆదాయం రూ. 36,009 కోట్లు. ఇది Q4FY22 లో సాధించిన ఆదాయం కన్నా 14% అధికం. Q4FY22 ఎయిర్ టెల్ రూ. 31,500 కోట్ల ఆదాయం సముపార్జించింది. అలాగే, Q4FY23 లో Q3FY23 తో పోలిస్తే, ఆపరేషన్స్ ఆదాయంలో ఎయిర్ టెల్ 0.6% వృద్ధిని మాత్రమే సాధించింది. ఎయిర్ టెల్ (Bharti Airtel) ఒక్కో వినియోగదారుడిపై సంపాదించిన ఆదాయం సగటు (average revenue per user ARPU) Q4FY23 లో రూ. 193 కాగా, Q4FY22 లో రూ. 178 గా ఉంది. ఎయిర్ టెల్ (Bharti Airtel) షేర్ వ్యాల్యూ మంగళవారం బీఎస్ఈలో 1.27% తగ్గి రూ. 787.85 వద్ద ముగిసింది.

తదుపరి వ్యాసం