Bharti Airtel Q3 results: ఎయిర్ టెల్ లాభాల్లో 91% వృద్ధి
Bharti Airtel Q3 results: భారతీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ (Airtel) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. దాదాపు అన్ని విభాగాల్లో సానుకూల ఫలితాలను సాధించిన ఎయిర్ టెల్ (Airtel).. మొత్తంగా 91% వృద్ధిని సాధించింది.
Bharti Airtel Q3 results: ఈ ఆర్థిక సంవత్సరం Q3 లో టెలీకాం రంగ దిగ్గజం భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) రూ. 1,582.2 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇవి గత Q3 తో పోలిస్తే, 91% అధికం కావడం విశేషం.
Bharti Airtel Q3 results: ఏపీఆర్యూ రూ. 193
డిసెంబర్ నెలతో ముగిసే త్రైమాసికంలో (Q3FY23) ఎయిర్ టెల్ (Airtel) రూ. 1,588.2 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 (Q3FY22) లో ఎయిర్ టెల్ (Airtel) సాధించిన నికర లాభం రూ. 829.6 కోట్లు మాత్రమే. మొబైల్ యూజర్ పై ఎయిర్ టెల్ (Airtel) సాధించిన సగటు ఆదాయం (average revenue per user ARPU) ఈ Q3 లో రూ. 193 కాగా, గత Q3 లో ఎయిర్ టెల్ ARPU రూ. 163 కావడం గమనార్హం.
Bharti Airtel Q3 results: ఆదాయం రూ. 35 వేల కోట్లు
మొత్తంగా ఎయిర్ టెల్ (Airtel) ఆపరేషన్స్ ఆదాయం ఈ Q3 లో రూ. 35,804 కోట్లు కాగా, గత Q3 లో అది రూ. 29,866 కోట్లు. అంటే, గత Q3 తో పోలిస్తే, ఈ Q3 లో సంస్థ ఆపరేషన్స్ ఆదాయం 20% పెరిగింది. అయితే, మార్కెట్ విశ్లేషకుల అంచనాను నికర లాభాల్లో ఎయిర్ టెల్ (Airtel) అందుకోలేకపోయింది. ఈ Q3 లో ఎయిర్ టెల్ కనీసం రూ. 2,673 కోట్ల నికర లాభాలను సముపార్జించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనాను ఈ Q3 లో ఎయిర్ టెల్ (Airtel) అందుకోలేకపోయింది. అయితే, పోస్ట్ పెయిడ్, ఎంటర్ ప్రైజ్, హోమ్స్, ఆఫ్రికా బిజినెస్ లలో ఎయిర్ టెల్ మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ Q3 లో ఎయిర్ టెల్ ఇండియా బిజినెస్ ఆదాయం రూ. 24,962 కోట్లుగా ఉంది. గత Q3 తో పోలిస్తే, ఇది 19.4% అధికం. ఫిబ్రవరి 7న ఎన్ఎస్ఈ ఎయిర్ టెల్ షేర్ 0.37% తగ్గి, రూ. 786.35 వద్ద స్థిరపడింది.