తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bharti Airtel Q1 Results: భారతి ఎయిర్ టెల్ క్యూ 1 నికర లాభాలు రూ. 1612 కోట్లు

Bharti Airtel Q1 Results: భారతి ఎయిర్ టెల్ క్యూ 1 నికర లాభాలు రూ. 1612 కోట్లు

HT Telugu Desk HT Telugu

03 August 2023, 18:45 IST

  • Bharti Airtel Q1 Results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(Q1FY24) ఫలితాలను టెలీకాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ గురువారం ప్రకటించింది. ఈ క్యూ 1 లో భారతి ఎయిర్ టెల్ రూ. 1612.5 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bharti Airtel Q1 Results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(Q1FY24) ఫలితాలను టెలీకాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ (Airtel) గురువారం ప్రకటించింది. ఈ క్యూ 1 లో భారతి ఎయిర్ టెల్ రూ. 1612.5 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 1 (Q1FY23) లో భారతి ఎయిర్ టెల్ రూ. 1,607 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంటే, గత సంవత్సరంతో పోలిస్తే ఈ Q1FY24లో భారతి ఎయిర్ టెల్ లాభాలు రూ. 5 కోట్లు మాత్రమే ఎక్కువ అని తెలుస్తుంది.

ఆదాయం మెరుగు

ఈ Q1FY24 లో భారతి ఎయిర్ టెల్ ఆదాయం రూ. 37,440 కోట్లు. గత సంవత్సరం Q1 కన్నా ఇది 14% అధికం. గత సంవత్సరం Q1 లో భారతి ఎయిర్ టెల్ రూ. 32,850 కోట్ల ఆదాయం సముపార్జించింది. ఈ క్యూ 1 లో సంస్థ ఈబీఐటీడీఏ (EBITDA) 19% పెరిగి, రూ. 19,746 కోట్లకు చేరింది.

సగటు యూజర్ ఆదాయం..

ఒక్కో వినియోగదారుడిపై ఎయిర్ టెల్ సంపాదించే సగటు ఆదాయం (ARPU) కూడా 9.28% పెరిగి రూ. 200 లకు చేరింది. టెలీకాం కంపెనీల ఆదాయాన్ని కొలిచే సాధనాల్లో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) కూడా ఒకటి. గత సంవత్సరం క్యూ 1లో ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ. 183గా ఉంది. ఎయిర్ టెల్ మొబైల్ రెవెన్యూ 12.4% పెరిగింది. కాగా సంస్థ ఏజీఎం సమావేశం ఆగస్ట్ 24వ తేదీన జరగనుంది. పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ లో ఎయిర్ టెల్ ఆధిక్యత కొనసాగుతోంది. Q1FY24 లో భారతి ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్ల సంఖ్య మరో 8 లక్షలు పెరిగింది. దాంతో, ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్ల సంఖ్య 4.04 కోట్లకు చేరింది.

తదుపరి వ్యాసం