తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Patanjali Foods Dividend: Q4 లో పతంజలి ఫుడ్స్ కు లాభాల పంట; షేర్ హోల్డర్లకు డివిడెండ్ కూడా..

Patanjali Foods dividend: Q4 లో పతంజలి ఫుడ్స్ కు లాభాల పంట; షేర్ హోల్డర్లకు డివిడెండ్ కూడా..

HT Telugu Desk HT Telugu

30 May 2023, 22:27 IST

  •  2022-23 ఆర్థిక సంవత్సరం  బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి ఫుడ్స్ Q4 ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ Q4 లో పతంజలి ఫుడ్స్ రూ. 349.38 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

బాబా రామ్ దేవ్ తో పతంజలి ఫుడ్స్ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ జీ
బాబా రామ్ దేవ్ తో పతంజలి ఫుడ్స్ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ జీ (Vipin Kumar/Hindustan Times)

బాబా రామ్ దేవ్ తో పతంజలి ఫుడ్స్ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ జీ

Q4FY23 లో పతంజలి ఫుడ్స్ రూ. 349.38 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది Q4FY22 లో సంస్థ సాధించిన నికర లాభాలతో పోలిస్తే, 18.16% అధికం. Q4FY22 పతంజలి ఫుడ్స్ రూ. 295.69 కోట్ల నికర లాభాలను సముపార్జించింది.

Patanjali Foods Q4 result: ఆదాయంలో వృద్ధి

Q4FY23లో పతంజలి ఫుడ్స్ మొత్తం ఆదాయం రూ. 7,872.92 కోట్లు. Q4FY23లో సంస్థ ఆదాయం రూ. 6,663.72 కోట్లు. అంటే, ఆదాయంలో కూడా ఈ సంవత్సరం కాలంలో 18.15% వృద్ధిని సంస్థ కనబర్చింది. మొత్తంగా సంస్థ ఫుడ్ బిజినెస్ ఆదాయంలో 13.70 % వృద్ధిని నమోదు చేసింది. Q4FY23 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 6 (300%) డివిడెండ్ గా ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో మంగళవారం పతంజలి షేర్ 0.8% పెరిగి, రూ. 1021.70 కి చేరింది.

Patanjali Foods FY23 results: మొత్తం ఆర్థిక సంవత్సరంలో..

FY23 లో పతంజలి ఫుడ్స్ మొత్తం ఆదాయం రూ. 31,821.45 కోట్లుగా ఉంది. FY22 లో సంస్థ సముపార్జించిన ఆదాయంతో పోలిస్తే, FY23 ఆదాయంలో 31.04% వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ (food and FMCG) సెగ్మెంట్లో సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ సెగ్మెంట్లో FY22 లో రూ. 1,683.24 కోట్ల ఆదాయం సమకూరగా, FY23 కి వచ్చేటప్పటికీ.. అది రూ. 6,218.08 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం సుమారు 33 దేశాలకు పతంజలి ఫుడ్స్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. FY23 లో ఈ ఎక్స్ పోర్ట్ టర్నోవర్ రూ. 530.80 కోట్లుగా ఉంది.

తదుపరి వ్యాసం