తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ambuja Cements Q1 Results: తగ్గిన అంబుజా సిమెంట్స్ లాభాలు; స్వల్పంగా పెరిగిన ఆదాయం

Ambuja Cements Q1 results: తగ్గిన అంబుజా సిమెంట్స్ లాభాలు; స్వల్పంగా పెరిగిన ఆదాయం

HT Telugu Desk HT Telugu

02 August 2023, 11:00 IST

    • Ambuja Cements Q1 results: భారత్ లో ప్రముఖ సిమెంట్ బ్రాండ్స్ లో ఒకటైన అంబుజా సిమెంట్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఈ Q1లో అదానీ గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్స్ రూ. 645 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ambuja Cements Q1 results: భారత్ లో ప్రముఖ సిమెంట్ బ్రాండ్స్ లో ఒకటైన అంబుజా సిమెంట్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఈ Q1లో అంబుజా సిమెంట్స్ రూ. 644.88 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత సంవత్సరం క్యూ1 లో సంస్థ సాధించిన నికర లాభాలైన రూ. 1,048.78 కోట్ల కన్నా 38.5% తక్కువ.

ఆదాయంలో మెరుగుదల

అంబుజా సిమెంట్స్ ఆదాయంలో Q1FY24 లో స్వల్ప మెరుగుదల నమోదైంది. Q1FY24 లో అంబుజా సిమెంట్స్ రూ. 4,729.7 కోట్ల ఆదాయం సముపార్జించింది. Q1FY23లో సంస్థ ఆదాయమైన రూ. 3,998.26 కోట్లు కన్నా ఇది 18.4% అధికం. సేల్స్ విషయానికి వస్తే, అంబుజా సిమెంట్స్ Q1FY24 లో 9.1 మిలియన్ టన్నుల సిమెంట్ ను సేల్ చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 1లో అంబుజా సిమెంట్స్ సేల్స్ 7.4 మిలియన్ టన్నులు. సంస్థ Q1FY24 లో సంస్థ EBITDA రూ. 948.8 కోట్లుగా ఉంది. Q1FY23లో ఇది రూ. 686 కోట్లు. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి అంబుజా సిమెంట్స్ షేర్ వాల్యూ బీఎస్ఈలో రూ. 459.65 గా ఉంది.

తదుపరి వ్యాసం