తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale On Laptops: ల్యాప్ టాప్ లపై ఆమెజాన్ సేల్ లో భారీ డిస్కౌంట్స్..

Amazon Sale on laptops: ల్యాప్ టాప్ లపై ఆమెజాన్ సేల్ లో భారీ డిస్కౌంట్స్..

HT Telugu Desk HT Telugu

20 October 2023, 15:03 IST

  • Amazon Sale on laptops: ఆమెజాన్ పండుగ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, హోం అప్లయన్సెస్, స్మార్ట్ డివైజెస్, ఫ్యాషన్, గ్రోసరీ.. సహా దాదాపు అన్ని రకాల ప్రొడక్ట్స్ అత్యధిక తగ్గింపు ధరల్లో లభ్యమవుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Amazon)

ప్రతీకాత్మక చిత్రం

Amazon Sale on laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగుస్తుంది. ఈ సేల్ లో టాప్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఆమెజాన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. వాటిలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా లాప్ టాప్ లపై ఉన్న టాప్ 5 ఆఫర్స్ ఇవే..

HP Chromebook X360: హెచ్ పీ క్రోమ్ బుక్ ఎక్స్ 360

ఈ ల్యాప్‌టాప్ 220 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. యూజర్ కు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఇందులో 360° రొటేట్ ఫీచర్‌ ఉంది. ఇందులో 4-కోర్ ఇంటెల్ సెలెరాన్ N4120 ప్రాసెసర్‌తో పాటు 4GB LPDDR4 RAM మరియు 64 GB ఉన్నాయి. ఇందులోని 47Wh బ్యాటరీ 45 నిమిషాల్లో 0% నుండి 50% వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ.32, 295 కాగా, ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మీరు ఈ రోజు దీన్ని 29% డిస్కౌంట్ తో రూ.22,990 లకే సొంతం చేసుకోవచ్చు.

Acer Chromebook Spin 11: ఏసర్ క్రోమ్ బుక్ స్పిన్ 1

ఇందులో 11.6 ఇంచ్ ల హెచ్ డీ టచ్ డిస్ ప్లే ఉంటుంది. యూజర్ కు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఇందులో 360° డిస్ ప్లే రొటేట్ ఫీచర్‌ ఉంది. ఇందులో 4 జీబీ ఎల్పీడీడీఆర్ 4 ర్యామ్, 64 బీజీ స్టోరేజ్ తో ఎన్ 4000 ప్రాసెసర్ ఉంది. ఈ ల్యాప్ టాప్ క్రోమ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ వైరస్ ప్రొటెక్షన్ ఫెసిలిటీ ఉంది. ఈ ల్యాప్ టాప్ కు 12.5 గంటల బ్యాటరీ లైఫ్ ఉంది. ఈ ఏసర్ క్రోమ్ బుక్ స్పిన్ 1 ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 45,787 కాగా, ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మీరు ఈ రోజు దీన్ని 20% డిస్కౌంట్ తో రూ.36, 630 లకే సొంతం చేసుకోవచ్చు.

Lenovo Chromebook Flex 3: లెనొవో క్రోమ్ బుక్ ఫ్లెక్స్ 3

ఇందులో 11.6 ఇంచ్ ల హెచ్ డీ 10 పాయింట్ టచ్ డిస్ ప్లే ఉంటుంది. యూజర్ కు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఇందులో 360° డిస్ ప్లే రొటేట్ ఫీచర్‌ ఉంది. ఇందులో 4 జీబీ డీడీఆర్ 4 ర్యామ్, 32 బీజీ స్టోరేజ్ తో ఇంటెల్ సెలరాన్ ఎన్ 4020 ప్రాసెసర్, ఇంటెల్ 600 గ్రాఫిక్ కార్డ్ ఉంది. ఈ ల్యాప్ టాప్ క్రోమ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ వైరస్ ప్రొటెక్షన్ ఫెసిలిటీ ఉంది. ఈ ల్యాప్ టాప్ కు 12.5 గంటల బ్యాటరీ లైఫ్ ఉంది. ఈ లెనొవో క్రోమ్ బుక్ ఫ్లెక్స్ 3 ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 32, 990 కాగా, ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మీరు ఈ రోజు దీన్ని రూ.28,990 లకే సొంతం చేసుకోవచ్చు.

Acer Chromebook 314: ఏసర్ క్రోమ్ బుక్ 314

ఇందులో 14 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ టచ్ డిస్ ప్లే ఉంటుంది. యూజర్ కు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఇందులో 360° డిస్ ప్లే రొటేట్ ఫీచర్‌ ఉంది. ఇందులో 4 జీబీ డీడీఆర్ 3 ర్యామ్, 64 బీజీ స్టోరేజ్ తో ఇంటెల్ సెలరాన్ ఎన్ 4000 ప్రాసెసర్ ఉంది. ఇంటెల్ యూహెచ్ డీ గ్రాఫిక్స్ ను కూడా ఇందులో పొందుపర్చారు. ఈ ల్యాప్ టాప్ తో పాటు అదనంగా 100 జీబీ గూగుల్ స్పేస్ ను కూడా ఇస్తున్నారు. ఈ ల్యాప్ టాప్ క్రోమ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఏసర్ క్రోమ్ బుక్ 314 ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ. 45,787 కాగా, ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మీరు ఈ రోజు దీన్ని 20% డిస్కౌంట్ తో రూ.36, 630 లకే సొంతం చేసుకోవచ్చు.

HP Chromebook 15a: హెచ్ పీ క్రోమ్ బుక్ 15 ఏ

ఈ ల్యాప్‌టాప్ 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 15.6-అంగుళాల హెచ్ డీ, టచ్‌ స్క్రీన్, మైక్రో-ఎడ్జ్ డిస్‌ ప్లేను కలిగి ఉంది. ఇందులో ఇంటెల్ సెలెరాన్ N4500 ప్రాసెసర్‌, ఇంటెల్ యూహెచ్ డీ గ్రాఫిక్స్ ఉన్నాయి.అలాగే, 4 జీబీ LPDDR4ఎక్స్ 3200 మెగా హెర్జ్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ తో పాటు అదనంగా 1 సంవత్సరం వ్యాలిడిటీతో 100 జీబీ గూగుల్ స్పేస్ ను కూడా ఇస్తున్నారు. ఈ ల్యాప్ టాప్ ఒరిజినల్ ధర రూ.33, 390 కాగా, ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో మీరు ఈ రోజు దీన్ని 28% డిస్కౌంట్ తో రూ.23,990 లకే సొంతం చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం