తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale 2023: 40 వేల రూపాయల లోపు ధరలోనే ప్రీమియం ల్యాప్ టాప్స్..

Amazon sale 2023: 40 వేల రూపాయల లోపు ధరలోనే ప్రీమియం ల్యాప్ టాప్స్..

HT Telugu Desk HT Telugu

10 October 2023, 16:38 IST

  • Amazon sale 2023: ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ప్రీమియం బ్రాండ్స్ ల్యాప్ టాప్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.

లెనొవో ఐడియా ప్యాడ్ ల్యాప్ టాప్
లెనొవో ఐడియా ప్యాడ్ ల్యాప్ టాప్ (Lenovo)

లెనొవో ఐడియా ప్యాడ్ ల్యాప్ టాప్

Amazon sale 2023: ఆమెజాన్ లో ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ () నడుస్తోంది. వివిధ ప్రొడక్ట్స్ పై ఆకర్షణీయమైన ఆఫర్స్ ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. రూ. 40 వేల లోపు ధరలో మంచి ల్యాప్ ట్యాప్ కొనే ఆలోచనలో ఉంటే ఈ కింది మోడల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి.

Lenovo IdeaPad Slim 3: లెనొవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3

ఈ ల్యాప్ టాప్ లో 8 జీబీ డీడీఆర్ 4 ర్యామ్ (DDR4 RAM) తో ఇంటెల్ కోర్ ఐ3 12 జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. 512 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఇందులో 15.6 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ప్రి లోడెడ్ విండోస్ 11, మూడు నెలల ఎక్స్ బాక్స్ గేమ్ పాస్ కూడా ఈ ల్యాప్ టాప్ తో పాటు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఇందులో బ్యాక్ లిట్ కీ ప్యాడ్, ఫింగర్ ప్రింట్ రీడర్, డాల్బీ ఆడియో, 720 పీ హెచ్ డీ కెమెరా తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ ను ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 36990 కే కొనుగోలు చేయవచ్చు.

Dell 14: డెల్ 14

ఈ ల్యాప్ టాప్ లో 8 జీబీ డీడీఆర్ 5 ర్యామ్ (DDR4 RAM) తో ఇంటెల్ కోర్ ఐ3 12 జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. 512 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఇందులో 14 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ప్రి లోడెడ్ విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ హోం, స్టుడెంట్ 2021 కూడా ఈ ల్యాప్ టాప్ తో పాటు ఉచితంగా లభిస్తాయి. ఈ ల్యాప్ టాప్ ను ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 37990 కే కొనుగోలు చేయవచ్చు.

HP 15s: హెచ్ పీ 15 ఎస్

ఈ ల్యాప్ టాప్ లో 8 జీబీ డీడీఆర్ 4 ర్యామ్ (DDR4 RAM) తో ఇంటెల్ కోర్ ఐ3 11 జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. ఇంటెల్ యూహచ్ డీ గ్రాఫిక్స్ తో పాటు 512 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది. ఇందులో 15.6 ఇంచ్ ల ఫుల్ హెచ్ డీ, యాంటీ గ్లేర్ డిస్ ప్లే ఉంటుంది. ప్రి లోడెడ్ విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ హోం, స్టుడెంట్ 2021 కూడా ఈ ల్యాప్ టాప్ తో పాటు ఉచితంగా లభిస్తాయి. ఇంకా ఇందులో న్యుమరిక్ కీ ప్యాడ్, మీడియా కార్డ్ రీడర్, 2 స్పీకర్ ఆడియో, 720 పీ హెచ్ డీ కెమెరా తదితర ఫీచర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ ను ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 35990 కే కొనుగోలు చేయవచ్చు.

తదుపరి వ్యాసం