తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale 2023: స్మార్ట్ టీవీలపై 64 శాతం వరకు డిస్కౌంట్; బ్యాంక్ ల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అదనం

Amazon Sale 2023: స్మార్ట్ టీవీలపై 64 శాతం వరకు డిస్కౌంట్; బ్యాంక్ ల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అదనం

HT Telugu Desk HT Telugu

12 October 2023, 15:10 IST

  • Amazon Sale 2023: అక్టోబర్ 8 వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఆమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో వివిధ బ్రాండ్స్ కు సంబంధించిన స్మార్ట్ టీవీలపై గరిష్టంగా 64% వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon Sale 2023: ఆమెజాన్ సేల్ లో వివిధ ప్రొడక్ట్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఉన్నాయి. ఈ సేల్ అక్టోబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. వివిధ బ్రాండ్స్ కు చెందిన, వివిధ సైజ్ ల స్మార్ట్ టీవీలపై ఈ సేల్ లో భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అందువల్ల, స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారు, పాత స్మార్ట్ టీవీ నుంచి బిగ్గర్ సైజ్, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న స్మార్ట్ టీవీకి అప్ గ్రేడ్ చేసుకోవాలనుకునే వారు ఈ సేల్ లో తక్కువ ధరకే నచ్చిన స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.

Samsung 165 cm: సామ్సంగ్ 65 ఇంచ్ ల స్మార్ట్ టీవీ

కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసం చూరగొన్న సంస్థ సామ్సంగ్ నుంచి వచ్చిన 65 ఇంచ్ (165 సెంటీమీటర్లు) స్మార్ట్ టీవీ ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival Sale) సేల్ లో 41% డిస్కౌంట్ అనంతరం రూ. 1,30,999 లకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఒరిజినల్ ధర రూ.2,22,900 . ఇది 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూ ఎల్ఈడీ టీవీ (4K Ultra HD Smart QLED TV). దీనికి 3 సంవత్సరాల కంపెనీ వారంటీ ఉంది. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, యూ ట్యూబ్ సహా అన్ని ప్రముఖ యాప్స్ ఇందులో ఇన్ బిల్ట్ గా ఉన్నాయి.

VU 126 cm: వీయూ 50 ఇంచ్ ల స్మార్ట్ టీవీ

వీయూ (VU) నుంచి వచ్చిన 50 ఇంచ్ ల (126 సెంటీమీటర్లు) గ్లో లెడ్ సిరీస్ 4 కే స్మార్ట్ టీవీ ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 36% డిస్కౌంట్ అనంతరం రూ. 34,990 లకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఒరిజినల్ ధర రూ.55000 . ఇది 4కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ (GloLED Series 4K Smart LED Google TV). ఇది స్టైలిష్ గ్రే ఫినిష్ తో మీ లివింగ్ రూమ్ కు కొత్త అందం తీసుకువస్తుంది. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, యూ ట్యూబ్ సహా అన్ని ప్రముఖ యాప్స్ ఇందులో ఇన్ బిల్ట్ గా ఉన్నాయి.

MI 100 cm: ఎంఐ 40 ఇంచ్ ల స్మార్ట్ టీవీ

ఎంఐ (MI) నుంచి వచ్చిన 40 ఇంచ్ ల (100 సెంటీమీటర్లు) 5 ఏ సిరీస్ ఫుల్ హెచ్ డీ స్మార్ట్ టీవీ ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 33% డిస్కౌంట్ అనంతరం రూ. 19,990 లకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఒరిజినల్ ధర రూ.29,999 . ఇది స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ (MI Full HD Smart Android LED TV). ఇందులో బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ ఉన్నాయి. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, యూ ట్యూబ్ సహా అన్ని ప్రముఖ యాప్స్ ఇందులో ఇన్ బిల్ట్ గా ఉన్నాయి.

TCL 164 cm: టీసీఎల్ 65 ఇంచ్ ల స్మార్ట్ టీవీ

టీసీఎల్ (TCL) నుంచి వచ్చిన 65 ఇంచ్ ల (164 సెంటీమీటర్లు) 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ టీవీ ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 64% డిస్కౌంట్ అనంతరం రూ. 59,990 లకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఒరిజినల్ ధర రూ.1,66,900 . ఇది 4 కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ (TCL 4K Ultra HD Smart QLED Google TV). ఇందులో బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ ఉన్నాయి. ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, యూ ట్యూబ్ సహా అన్ని ప్రముఖ యాప్స్ ఇందులో ఇన్ బిల్ట్ గా ఉన్నాయి.

తదుపరి వ్యాసం