తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Great Indian Festival: ఆమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్స్.. అన్నీ ప్రీమియం బ్రాండ్సే..

Amazon Great Indian Festival: ఆమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్స్.. అన్నీ ప్రీమియం బ్రాండ్సే..

HT Telugu Desk HT Telugu

10 October 2023, 18:22 IST

  • Amazon Great Indian Festival: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ నెల 8 న ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 15వ తేదీ వరకు జరుగుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Amazon)

ప్రతీకాత్మక చిత్రం

Amazon Great Indian Festival: ఆమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 32 ఇంచ్ ల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. అన్ని ప్రీమియ బ్రాండ్స్ స్మార్ట్ టీవీలు అత్యంత చవకగా ఈ సేల్ లో లభిస్తున్నాయి. అదనంగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

Redmi HD Ready Smart LED Fire TV: రెడ్ మి ఫైర్ టీవీ

ఇది మెటాలిక్ బెజిల్ లెస్ డిజైన్ తో వస్తోంది.178 డిగ్రీ యాంగిల్ లో కూడా స్పష్టంగా ఈ టీవీని చూడవచ్చు. ఈ టీవీలో 1366x768 పీ రిజొల్యూషన్, 60 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇందులో 20 వాట్ డాల్బీ స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో బిల్ట్ ఇన్ ఫైర్ టీవీ, ఆమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, యూట్యూబ్ సహా మొత్తం 12 వేల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీ రిమోట్ లో అలెక్సా బిల్ట్ ఇన్ గా ఉంటుంది. ఈ 32 ఇంచ్ ల స్మార్ట్ టీవీ ని ఆమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ.8999 లకే సొంతం చేసుకోవచ్చు.

Samsung LED Smart TV: సామ్సంగ్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ

ఇది గ్లాసీ బ్లాక్ డిజైన్ తో వస్తుంది. డాల్బీ డిజిటల్ ప్లస సపోర్ట్ ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలో 1366x768 పీ రిజొల్యూషన్, 60 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇందులో 20 వాట్ డాల్బీ స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో బిల్ట్ ఇన్ ఆమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, యూట్యూబ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ టీవీ రిమోట్ లో అలెక్సా బిల్ట్ ఇన్ గా ఉంటుంది. ఈ 32 ఇంచ్ ల స్మార్ట్ టీవీ ని ఆమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ.11990 లకే సొంతం చేసుకోవచ్చు.

LG Smart LED TV: ఎల్జీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ

ప్రీమియం బ్రాండ్ ఎల్జీ నుంచి వచ్చిన హెచ్ డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఇది. ఇందులో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. మీ ఇంట్లోని ఇతర ఎల్జీ స్మార్ట్ ప్రొడక్ట్స్ ను ఈ టీవీ ద్వారానే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సర్ఫింగ్ కు కూడా ఇది చాలా యాప్ట్. ఇందులో 1366x768 పీ రిజొల్యూషన్, 60 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇందులో 20 వాట్ స్పీకర్స్ ఉన్నాయి. ఇందులో బిల్ట్ ఇన్ ఆమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్, యూట్యూబ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ 32 ఇంచ్ ల స్మార్ట్ టీవీ ని ఆమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 13490 లకే సొంతం చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం