తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Power Q1 Results: అదానీ పవర్ ఆదాయం తగ్గింది.. లాభాలు పెరిగాయి..

Adani Power Q1 results: అదానీ పవర్ ఆదాయం తగ్గింది.. లాభాలు పెరిగాయి..

HT Telugu Desk HT Telugu

04 August 2023, 18:55 IST

  • Adani Power Q1 results: అదానీ గ్రూప్ కు చెందిన అదానీ పవర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ క్యూ 1 లో నికర లాభాలు 83% పెరిగినట్లు, ఆదాయం 19% తగ్గినట్లు అదానీ పవర్ ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

Adani Power Q1 results: అదానీ గ్రూప్ కు చెందిన అదానీ పవర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ క్యూ 1 లో నికర లాభాలు 83.26% పెరిగినట్లు, ఆదాయం 19.8% తగ్గినట్లు అదానీ పవర్ ప్రకటించింది. టాక్స్ బిల్లు భారీగా తగ్గడంతో పేమెంట్స్ ఆలస్యంగా అందడం కారణంగా లాభాల్లో వృద్ధి నమోదైంది.

నికర లాభాల్లో వృద్ధి

అదానీ పవర్ నికర లాభాలు ఈ క్యూ1 లో(Q1FY24) రూ. 87.59 (1.06 బిలియన్ డాలర్లు) బిలియన్లని సంస్థ ప్రకటించింది. గత సంవత్సరం క్యూ 1 (Q1FY23) లో అదానీ పవర్ సాధించిన నికర లాభాలు రూ. 47.80 బిలియన్లు. అంటే, గత క్యూ 1 (Q1FY23) తో పోలస్తే, ఈ క్యూ 1 (Q1FY24) లో అదానీ పవర్ లాభాల్లో 83.26% వృద్ధి నమోదైంది. టాక్స్ బిల్ సుమారు 96% తగ్గడంతో వడ్డీతో పాటు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి పేమెంట్స్ ఆలస్యంగా అందడం వల్ల సంస్థ భారీ లాభాలను చూపించగలిగింది.

ఆదాయం తగ్గింది..

కాగా అదానీ పవర్ ఆదాయం ఈ క్యూ 1 లో రూ. 110.06 బిలియన్లుగా ఉంది. ట్రాన్స్ మిషన్ బిజినెస్ లో డిమాండ్ గణనీయంగా తగ్గిన పరిస్థితుల్లో ఆదాయం భారీగా తగ్గింది. గత నెలలో ప్రకటించిన ఫలితాల్లో పవర్ గ్రిడ్ కూడా నష్టాలు చవిచూసినట్లు వెల్లడించింది. మరోవైపు, అదానీ పవర్ ఇంధన ఖర్చు కూడా సుమారు 5.3% తగ్గింది. అలాగే, బొగ్గు దిగుమతిపై చేస్తున్న వ్యయం కూడా దాదాపు 60% తగ్గింది. ఈ క్యూ 1 ఫలితాల నేపథ్యంలో శుక్రవారం అదానీ పవర్ షేర్ విలువ సుమారు 4.8% పెరిగింది.

తదుపరి వ్యాసం