తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Tata Nexon Facelift: 2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ అయ్యేది ఆ నెలలోనే: ఏ మార్పులు ఉండొచ్చంటే..!

2023 Tata Nexon Facelift: 2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ అయ్యేది ఆ నెలలోనే: ఏ మార్పులు ఉండొచ్చంటే..!

03 May 2023, 12:09 IST

    • 2023 Tata Nexon Facelift: 2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్‌ గురించి కొన్ని వివరాలు బయటికి వచ్చాయి. ఏ నెలలో లాంచ్ అవుతుందన్న సమాచారం వెల్లడైంది.
2023 Tata Nexon Facelift: 2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ అయ్యేది ఆ నెలలోనే: ఏ మార్పులు ఉండొచ్చంటే..! (Photo: HT Auto)
2023 Tata Nexon Facelift: 2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ అయ్యేది ఆ నెలలోనే: ఏ మార్పులు ఉండొచ్చంటే..! (Photo: HT Auto)

2023 Tata Nexon Facelift: 2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ అయ్యేది ఆ నెలలోనే: ఏ మార్పులు ఉండొచ్చంటే..! (Photo: HT Auto)

2023 Tata Nexon Facelift: ఎస్‍యూవీ లైనప్‍లో మార్పులు తెచ్చేందుకు ప్రముఖ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీ టాటా నెక్సాన్‍(Tata Nexon)కు ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‍ను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. 2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ జూలై నెలలో లాంచ్ కానుందని సమాచారం బయటికి వచ్చింది. ప్రస్తుత నెక్సాన్‍తో పోలిస్తే ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‍ డిజైన్ సహా మరికొన్ని మార్పులతో రానుందని తెలుస్తోంది.

ఎక్స్‌టీరియర్ మార్పులు!

2023 Tata Nexon Facelift: 2023 నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ కారు జూలైలో విడుదల అవుతుందని సంబంధిత వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‍ టెస్టింగ్ సమయంలో కెమెరాలకు చిక్కింది. దీంతో డిజైన్‍కు సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతం నెక్సాన్ ఎస్‍యూవీ ఫ్రంట్ డిజైన్ కర్వీగా ఉండగా.. ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ ఫ్రంట్ లుక్ మరింత భారీగా మస్కులర్‌గా కనిపించేలా ఉంటుందని లీకైన ఫొటోలను బట్టి తెలుస్తోంది. మొత్తంగా ఫ్రంట్ డిజైన్ మార్పులతో నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ వస్తుందని తెలుస్తోంది.

2023 Tata Nexon Facelift: టాటా నెక్సాన్ ఎస్‍యూవీ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‍కు ఫ్రంట్‍లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్.. మెయిన్ హెడ్‍ల్యాంప్‍లపై ఉంటాయని తెలుస్తోంది. మెయిన్ హెడ్‍ల్యాంప్‍ను టాటా మోటార్స్ బంపర్‌పై ఇవ్వనుందని అంచనా. ప్రొజెక్టర్ సెటప్ కూడా ఉంటుంది. Curvv కాన్సెప్టును స్ఫూర్తిగా తీసుకొని నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ డిజైన్‍కు టాటా మోటార్స్ మార్పులు చేస్తోందని తెలుస్తోంది.

2023 Tata Nexon Facelift: 2023 టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ బొనెట్ ఫ్లాట్ డిజైన్‍ను కలిగి ఉంటుంది. సరికొత్త అలాయ్ వీల్ డిజైన్‍తో ఫ్లేర్డ్ వీల్స్ ఆర్చెస్ ఉంటాయి. బయట ఉండే రేర్‌వ్యూ మిర్రర్లు కూడా సరికొత్త డిజైన్‍తో ఉండనున్నాయి. సఫారీ, హారియర్ మిర్రర్‌లను ఇవి పోలి ఉంటాయి. ప్రస్తుత నెక్సాన్‍తో పోలిస్తే నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ వెనుక డిజైన్‍లో కూడా మార్పులు ఉండనున్నాయి. లైట్‍బార్ ద్వారా కనెక్ట్ అయి ఉండే స్లీక్ టెయిల్ ల్యాంప్‍లు వెనుక ఉంటాయి. ఫేస్‍లిఫ్ట్ లైనప్‍లో టాప్ వేరియంట్లు డైనమిక్ టర్న్ ఇండికేటర్లతో రానున్నాయి.

ఇంటీరియర్‌లోనూ..

2023 Tata Nexon Facelift: టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ ఇంటీరియర్‌లోనూ కొన్ని అప్‍గ్రేడ్స్ ఉండనున్నాయి. సఫారీ, హారియర్‌లలో ఉండే లాంటి 10.25 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ స్క్రీన్‍ను ఈ నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‍లోనూ టాటా మోటార్స్ ఇస్తుందని తెలుస్తోంది. ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా సరికొత్తగా ఉండనుంది.

తదుపరి వ్యాసం