తెలుగు న్యూస్  /  బిజినెస్  /  High Dividend Stocks: భారీగా డివిడెండ్ ఇచ్చే ప్రభుత్వ రంగ స్టాక్స్ ఇవే..

High dividend stocks: భారీగా డివిడెండ్ ఇచ్చే ప్రభుత్వ రంగ స్టాక్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu

03 June 2023, 17:39 IST

  • మదుపర్లకు భారీగా డివిడెండ్ ను ఇచ్చే ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను రెలిగేర్ బ్రోకరేజ్ సంస్థ (Religare Broking) తెలిపింది. వాటిలో సెయిల్, ఎన్ఎండీసీ, ఐఓసీ వంటివి 10% వరకు డివిడెండ్ ఇస్తున్నాయి. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మంచి డివిడెండ్ ఇచ్చే సంస్థలపై ఇన్వెస్టర్లకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అవి ప్రభుత్వ రంగ సంస్థలైతే పెట్టుబడి కూడా సురక్షితమన్న భరోసా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రెలిగేర్ బ్రోకింగ్ సంస్థ తక్కువ పెట్టుబడితో మంచి డివిడెండ్ ను ఇచ్చే ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను తెలిపింది. వాటిలో సెయిల్ (SAIL), ఎన్ఎండీసీ (NMDC), ఐఓసీ (IOC) వంటివి 10% వరకు డివిడెండ్ ఇస్తున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థల వివరాలు..

డివిడెండ్ ఇచ్చే పీఎస్యూలు

ఈ ప్రభుత్వ రంగ సంస్థ షేర్ హోల్డర్లకు గత 12 నెలల్లో 10.6% డివిడెండ్ ప్రకటించింది. సెయిల్ ప్రస్తుత డివిడెండ్ పర్ షేర్ 8.8 గా ఉంది. అలాగే, గత 12 నెలల్లో ఎన్ఎండీసీ 9.9% డివిడెండ్ అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎండీసీ ఇన్వెస్టర్లకు రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై మొత్తం రూ. 6.60 లను డివిడెండ్ గా ఇచ్చింది. ఎన్ఎండీసీ డివిడెండ్ పర్ షేర్ (DPS) 10.6 ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఇన్వెస్టర్లకు గత 12 నెలల్లో 9.5% డివిడెండ్ అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఓసీ ఇన్వెస్టర్లకు రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ పై మొత్తం రూ. 3 లను డివిడెండ్ గా ఇచ్చింది. ప్రస్తుతం ఐఓసీ డివిడెండ్ పర్ షేర్ 8.5 గా ఉంది.

ఇవి కూడా..

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీ ఇన్వెస్టర్లకు 8.3% డివిడెండ్ అందించింది. గత 12 నెలల్లో ఈ సంస్థ ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 15.3 లను డివిడెండ్ గా అందించింది. ఆర్ఈసీ డివిడెండ్ పర్ షేర్ ప్రస్తుతం 11.7 గా ఉంది. పీటీసీ ఇండియా సంస్థ గత 12 నెలల్లో 7.8% డివిడెండ్ అందించిందిద. ఈ సంస్థ ప్రస్తుత డీపీఎస్ 5.7 గా ఉంది. ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.5 లను డివిడెండ్ గా ప్రకటించింది. మరోవైపు కోల్ ఇండియా లిమిటెడ్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్లకు 242.5% అంటే రూ. 24.25 లను డివిడెండ్ గా అందించింది. ఈ సంస్థ ప్రస్తుత డివిడెండ్ పర్ షేర్ (DPS) 17 గా ఉంది. ఓఎన్జీసీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.25 లను డివిడెండ్ గా ప్రకటించింది. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందించాయి.

సూచన: నిపుణుల సూచనలతో కూడిన కథనం ఇది. ఇన్వెస్టర్ల స్వీయ నిర్ణయం సముచితం.

తదుపరి వ్యాసం