తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Tekkali: అభ్యర్థి ఆయన కాదు 'ఆమె'.. టెక్కలిలో వ్యూహం మార్చిన వైసీపీ

YSRCP Tekkali: అభ్యర్థి ఆయన కాదు 'ఆమె'.. టెక్కలిలో వ్యూహం మార్చిన వైసీపీ

27 May 2023, 9:05 IST

    • Tekkali YSRCP MLA Candidate: టెక్కలి సీటుపై వ్యూహం మార్చింది వైసీపీ. కొత్తగా మరో అభ్యర్థిని నియమించింది. ఇదీ కాస్త టెక్కలి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.
మారిన టెక్కలి వైసీపీ అభ్యర్థి!
మారిన టెక్కలి వైసీపీ అభ్యర్థి!

మారిన టెక్కలి వైసీపీ అభ్యర్థి!

YSRCP Latest News:ఎన్నికలకు చాలా సమయం ఉండగానే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం గట్టిగా జరుగుతోంది. సమయం దొరికితే చాలు... వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ రోడ్ మ్యాప్ ను గీసుకుంటున్నాయి. వైసీపీ అయితే ఏకంగా వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తోంది. ఆ దిశగానే కార్యక్రమాలు చేపడుతోంది. ఇక గెలిచే అభ్యర్థులపై విషయంపై కూడా మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఓ సీటుపై ప్రధానంగా ఫోకస్ పెట్టేసింది. కొద్దిరోజుల కిందటే అభ్యర్థిని కూడా ప్రకటిచంగా....తాజాగా వ్యహన్ని మార్చేసింది.

ట్రెండింగ్ వార్తలు

APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

AP Weather Updates: పగలు మండే ఎండలు, సాయంత్రానికి భారీ వర్షాలు, ఏపీకి ఐఎండి తీపి కబురు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

టెక్కలి... ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. ఈసీటుపై కన్నేసింది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కొద్దిరోజుల కింటే ఆ పార్టీ సీనియర్‌ నేత, గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‌ పేరును ప్రకటించింది. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా టెక్కలి నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. స్వయంగా పార్టీ అధినేతనే పేరును ప్రకటించటంతో ఆయన క్షేత్రస్థాయిలో తెగ తిరిగేస్తున్నారు. సీన్ కట్ చేస్తే వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్కలి అసెంబ్లీ సీటు నుంచి దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి పోటీ చేస్తారని తాజాగా ప్రకటించింది. ఆయనకు కాకుండా భార్యకు టికెట్‌ ను ఖరారు చేసిన నేపథ్యంలో టెక్కలి వైసీపీలో ఏం జరుగుతోందన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఓ అంచనాకు వచ్చిన తర్వాత... పార్టీ నిర్ణయం మారిందన్న చర్చ వినిపిస్తోంది. ఆయనకు టికెట్ ఇస్తే... అచ్చెన్నాయుడు మరోసారి విజయం సాధించే అవకాశం ఉందన్న విషయం ఫ్యాన్ పార్టీ హైకమాండ్ అర్థం కావటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉండగా.. ఆయన భార్యకు టికెట్ ఇవ్వటం ద్వారా సీటు గెలిచే అవకాశాలు ఉందని వైసీపీ భావిస్తోంది. ఇక టెక్కలి నియోజకవర్గంలో కళింగుల ఓట్లు ఎక్కువ శాతం ఉండటంతో అదే సామాజికవర్గానికి చెందిన ఓ మహిళకు టికెట్ ఇస్తే క్యాస్ట్ పాలిటిక్స్‌తో పాటు మహిళ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనేది వైసీపీ అంచనాగా కనిపిస్తోంది.

అభ్యర్థి మార్పు విషయాన్నే స్వయంగా దువ్వాడ శ్రీనివాసే తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ తరఫున వాణీ బరిలో ఉంటారని ప్రకటించారు. కొన్నాళ్లుగా వారి కుటుంబంలో రాజకీయ పరంగా గొడవలు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వారిద్దరూ ఖండించారు. ఈ క్రమంలోనే భర్తను కాదని... భార్యను అభ్యర్థిగా ప్రకటించటం, దువ్వాడనే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించటంతో రాజకీయ పంచాయతీకి తెరపడినట్లయింది. మొత్తంగా ఈ పరిణామంతో వైసీపీకి లాభం చేకూరుతుందా..? లేదా అనేది చూడాలి…!

తదుపరి వ్యాసం