తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Murder : 18ఏళ్ల లవర్‌తో కలిసి మొగుడి హత్య…. పోలీసులకు దొరికి పోయారిలా…

Vizag Murder : 18ఏళ్ల లవర్‌తో కలిసి మొగుడి హత్య…. పోలీసులకు దొరికి పోయారిలా…

HT Telugu Desk HT Telugu

23 July 2022, 8:59 IST

    • భర్త మీద అయిష్టతతో ఆమె పక్కదారి పట్టింది. తన కంటే  వయసులో 11ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది.  కాపురాన్ని కాదనుకుని చివరకు భర్తనే హతమార్చి ఏమి తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాలతో  భార్యమణి నిర్వాకాన్ని పోలీసులు బయటపెట్టారు. ఇష్టంలేని భర్తను దారుణంగా హతమార్చి శవం కూడా దొరక్కుండా కాల్చేసిన  దుర్మార్గం బయటపడింది. 
ఇష్టం లేని కాపురం చేయలేక భర్త దారుణ హత్య
ఇష్టం లేని కాపురం చేయలేక భర్త దారుణ హత్య

ఇష్టం లేని కాపురం చేయలేక భర్త దారుణ హత్య

ఆమెకు 29ఏళ్లు.... ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది.... భర్త ఆఫ్రికాలో ప్రొఫెసర్‌.... చక్కటి సంసారం… ఏడేళ్ల కొడుకుతో కలిసి విశాఖలో ఉంటోంది. భర్త మీద అయిష్టతతో 18ఏళ్ల ప్రియుడితో కలిసి మొగుడ్ని దారుణంగా చంపేసి శవాన్ని కా ల్చేసింది. ఆపై భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు సంగతి బయటపడింది.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

ప్రియుడిపై మోజుతో విశాఖపట్నంలో ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. శ్రీకాకుళం జిల్లా పిల్లలవలస గ్రామానికి చెందిన బుడుమూరి మురళి ఆఫ్రికాలో అధ్యాపక వృత్తిలో ఉన్నారు. 2014లో మురళికి విశాఖపట్నం మధురవాడకు చెందిన మృదులతో పెళ్లైంది. పెళ‌్ళైన తర్వాత భార్యతో కలిసి ఆఫ్రికా వెళ్లిపోయారు. 2015లో వీరికి ఓ కొడుకు పుట్టాడు. కుమారుడికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో భార్య, కుమారుడిని విశాఖపట్నం పంపారు. మృదుల కొన్నాళ్లు మధురవాడలో పుట్టింట్లోనే ఉంది.

ఏడాది క్రితం మురళి మధురవాడ రిక్షా కాలనీలో సొంతింటిని నిర్మించడంతో భార్య, కుమారుడు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఏడాదికోసారి స్వదేశానికి వచ్చే మురళీ నెలరోజులు ఉండి ఆఫ్రికా వెళ్లిపోయేవారు. కొత్త ఇంట్లోకి మారిన తర్వాత మృదులకు హరిశంకర్‌ వర్మతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి సొంతింట్లో ఉండటం ప్రారంభించారు.

జులై 9న సెలవులపై స్వదేశానికి వచ్చిన మురళీ ఆ తర్వాతి రోజే కనిపించకుండా పోయారు. జులై 17న మృదుల భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో మృదుల ఇంటికి విశాఖ సాయిరాం కాలనీకి చెందిన హరిశంకర్‌ వర్మ అనే యువకుడు తరచూ వస్తున్నట్లు తేలింది. మృదుల కాల్‌డేటాను పోలీసులు పరిశీలించడంతో తరచు అతనితో మాట్లాడుతున్నట్లు గుర్తించారు.

దీంతో హరిశంకర్‌ వర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్‌లో విచారించారు. ఎనిమిది నెలల క్రితం మృదులతో పరిచయం ఏర్పడిందని, ఇద్దరు కలిసి ఆమె ఇంట్లోనే ఉంటున్నట్లు పోలీసులకు చెప్పాడు. మురళీని వదిలించుకోవాలనే ప్రణాళికతో ఆఫ్రికా నుంచి వచ్చిన మర్నాడే హతమార్చినట్లు అంగీకరించాడు.

జులై 10 అర్థరాత్రి మురళీని రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా మృదుల పెనం, కుక్కర్ మూతతో తలపై కొట్టి చంపినట్లు వివరించాడు. గాయాలతో అక్కడికక్కడే మురళీ చనిపోవడంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి మారికవలస బ్రిడ్జి వద్ద తుప్పల్లో పడేశారు. రెండ్రోజుల తర్వాత ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో పెట్రోల్ తీసుకువెళ్లి శవాన్ని తగులబెట్టేసినట్లు ఒప్పుకున్నాడు. హరిశంకర్‌ వర్మ వాంగ్మూలంతో మృదులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. భర్తతో కాపురం ఇష్టం లేక ప్రియుడితో కలిసి హతమార్చినట్లు మృదుల అంగీకరించింది. తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, వయసులో ఇద్దరి మధ్య తేడా ఉండటం, భర్త సంపాదన కోసం ఆఫ్రికాలో ఉండిపోవడం వంటి కారణాలతో మృదుల దారి తప్పిందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

టాపిక్

తదుపరి వ్యాసం