తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Child Pornography : చిన్నారుల అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్న వారిపై కేసులు

Child Pornography : చిన్నారుల అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్న వారిపై కేసులు

HT Telugu Desk HT Telugu

15 October 2022, 8:35 IST

    • Child Pornography సామాజిక మాధ‌్యమాల్లో చిన్నారుల అశ్లీల చిత్రాలు, వీడియోలను అప్లోడ్ చేస్తున్న వారిని పోలీసులు గుర్తిస్తున్నారు.  ఇటీవలి కాలంలో  చిన్నారుల అశ్లీల చిత్రాలు, వీడియోలు అప్లోడ్‌ చేసిన 12 మంది విజయవాడ వాసుల్ని ఏపీసిఐడి గుర్తించింది. అశ్లీల చిత్రాలు, వీడియోలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా గ్రామ్‌లలో అప్లోడ్ చేస్తున్న వారిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. 
చిన్నారుల అశ్లీల వీడియోలు అప్లోడ్ చేస్తున్న వారిపై కేసులు
చిన్నారుల అశ్లీల వీడియోలు అప్లోడ్ చేస్తున్న వారిపై కేసులు

చిన్నారుల అశ్లీల వీడియోలు అప్లోడ్ చేస్తున్న వారిపై కేసులు

Child Pornography చిన్న పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్న వారిపై విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల్లో నాలుగు కేసులు నమోదు చేశారు. విజయవాడ నుంచి ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌‌లలో జీ మెయిల్‌ ద్వారా పిల్లల అశ్లీల చిత్రాలను అప్‌లోడ్‌ చేస్తున్నట్లు సీఐడీ విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు. ఒక కేసులో 12 మంది నిందితుల్ని గుర్తించారు. అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేస్తున్న వారిలో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల అశ్లీల చిత్రాలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయటం తీవ్రమైన నేరమని వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

Child Pornography వ్యవహారంపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకురావడంతో పోలీసులు ఈ తరహా ఘటనలపై నిరంతరం పోలీసు నిఘా ఉంచుతున్నారు. ఎవరైనా ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వెంటనే గుర్తిస్తారు. నిందితులు ఉపయోగించిన ఐపీలు, మెయిల్ ఐడీల ఆధారంగా సీఐడీ విభాగం ఇలాంటి వారి వివరాలను గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తుంది. గత కొద్ది నెలల వ్యవధిలో పోర్న్ వెబ్‌సైట్లను వినియోగిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో గుర్తించారు. బ్లాక్‌ చేసిన వెబ్‌సైట్లను సైతం కొంతమంది వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు.

తాజా ఘటనలో విజయవాడ నగరానికి చెందిన కొంతమంది అశ్లీల చిత్రాలు అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించి సీఐడీ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సిఐడి అందించిన వివరాలతో విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు రంగంలోకి దిగి ఒక కేసులో ముగ్గురు మహిళలు సహా 12 మందిపై కేసు నమోదు చేశారు.

వెబ్ సైట్లలో ఫోటోలు అప్‌లోడ్‌ చేసిన కేసులో నిందితులను షేక్‌ షెహనాజ్‌, తెంటు బ్రహ్మానందరావు, గుడివాడ వెంకట మణికంఠ శ్రీపాండు రంగ, చక్కా కిరణ్‌కుమార్‌ రామకృష్ణ, ఎస్‌.కె.నాగుల్‌ మీరావలి, రవి యర్రభనేని, రవి అంజయ్య, కట్టా సాయికృష్ణ, పాల్వంచ తిరుమల లక్ష్మీనరసింహాచార్యులు, ఎస్‌.కె.అంజలి, పులిపాటి భావన, దాసి సరళలపై ఒక కేసు నమోదు చేశారు. మరో కేసులో వెనుటూరుమిల్లి అజయ్‌కుమార్‌, కమలేష్‌ కుమార్‌ చౌదరిలపై మరో కేసు నమోదు చేశారు. వీటితో పాటు మరో రెండు కేసుల్లో నిందితుల్ని పోలీసులు గుర్తించారు.

టాపిక్

తదుపరి వ్యాసం