తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తా- చంద్రబాబు

Chandrababu : ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తా- చంద్రబాబు

02 December 2023, 16:01 IST

    • Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు
చంద్రబాబు

చంద్రబాబు

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో చంద్రబాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తానన్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలు సిరిసంపదలతో ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నాన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

దుర్గమ్మ సన్నిధిలో చంద్రబాబు

సమాజాన్ని రక్షించి, దుష్టుల్ని శిక్షించమని

కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి అని.. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్ధించానని చంద్రబాబు చెప్పారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు. తనకు కష్టం వచ్చినప్పుడు న్యాయం కోసం, ధర్మం కోసం దేశ విదేశాల్లో పోరాటాలు చేశారన్నారు. అధికార యంత్రాంగం తమ ధర్మాన్ని నిర్వర్తించాలని చంద్రబాబు సూచించారు. దుర్గమ్మ ఆలాయినికి వచ్చిన చంద్రబాబుకు కేశినేని నాని, జనసేన నేత పోతిన మహేష్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమా, మాగంటి బాబు, బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు.

విద్యార్థులతో ముచ్చట

గుంటూరు ఉమెన్స్ కాలేజీకు చెందిన విద్యార్థినులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలకరించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళుతూ ఉండగా.... కొండవీటి వాగు లిఫ్ట్ వద్ద స్టూడెంట్స్ కనిపించారు. దీంతో కారు ఆపి చంద్రబాబు వారిని పలకరించారు. ఎక్కడ నుంచి వచ్చారని వారిని అడిగారు. తాము బీఈడీ విద్యార్థులమని, స్టడీ టూర్ కోసం గుంటూరు నుంచి వచ్చామని స్టూడెంట్స్ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో విద్యార్థినులు ఫొటోలు దిగారు.

తదుపరి వ్యాసం