తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Tickets : తిరుమల జనవరి కోటా ఆర్జిత సేవ టికెట్లు విడుదల.. బుక్ చేయండి ఇలా?

Tirumala Tickets : తిరుమల జనవరి కోటా ఆర్జిత సేవ టికెట్లు విడుదల.. బుక్ చేయండి ఇలా?

HT Telugu Desk HT Telugu

12 December 2022, 9:45 IST

    • TTD Update : జనవరి నెలకు సంబంధించి.. ఆర్జిత సేవా టికెట్లు సోమవారం విడుదలవుతాయి. డిసెంబర్ 16, 31వ తేదీకి సంబంధించి.. స్పెషల్ 300 రూపాయల దర్శనం టైం స్లాట్ టోకెన్లు సైతం విడుదల చేయనుంది టీటీడీ.
తిరుమల టికెట్లు
తిరుమల టికెట్లు

తిరుమల టికెట్లు

2023 జనవరి నెలకు సంబంధించిన.. తిరుమల(Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను సోమవారం టీటీడీ(TTD) విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు.. ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని.. ఆన్ లైన్ లో టికెట్లు పొందేందుకు సిద్ధంగా ఉండాలని టీటీడీ పేర్కొంది. అయితే.. ఈ ఆర్జిత సేవా టికెట్లతోపాటుగా.. 2023 జనవరి నెలకు సంబంధించి.. మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లకు ఆన్ లైన్(Online) లక్కీడిప్ నమోదు కూడా మెుదలుకానుంది.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

సోమవారం ఉదయం 10 గంటల నుండి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది. అనంతరం లక్కీడిప్ లో టికెట్లు కేటాయించనున్నారు. ఈ లక్కీడిప్ లను సైతం.. అధికారిక వెబ్ సైట్(Website) ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దళారులను నమ్మెుద్దని.. టీటీడీ(TTD) హెచ్చరించింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తారు. అధికారిక వెబ్ సైట్లో క్లిక్ చేసి.. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీ(OTP) వస్తుంది.

డిసెంబర్ 16, 31వ తేదీల్లో 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్ లైన్ కోటా.. మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది. ప్రత్యేక దర్శనం(Special Darshan) కావాలని.. అనుకునేవారు టికెట్లు బక్ చేసుకోవచ్చు. టికెట్లు బుక్ చేసుకునేందుకు.. ttdsevaonline.com రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేశాక.. అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డును చూసి.. మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే.. ఖాళీలు ఉంటే.. గ్రీన్ కలర్ కనిపిస్తుంది.

ఆ తర్వాత.. అక్కడ నొక్కితే.. టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధానంగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం