తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Calendars 2024 : టీటీడీ క్యాలెండర్లు, డైరీలు వచ్చేశాయ్.. ఇలా తీసుకోవచ్చు

TTD Calendars 2024 : టీటీడీ క్యాలెండర్లు, డైరీలు వచ్చేశాయ్.. ఇలా తీసుకోవచ్చు

29 October 2023, 6:44 IST

    • TTD calendars: 2024 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను విడుదల చేసింది టీటీడీ. ఈ మేరకు పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు ప్రకటించింది. ధరల వివరాలను కూడా పేర్కొంది.
టీటీడీ క్యాలెండర్లు, డైరీలు
టీటీడీ క్యాలెండర్లు, డైరీలు

టీటీడీ క్యాలెండర్లు, డైరీలు

TTD Calendars 2024: టీటీడీ క్యాలెండర్లు వచ్చేశాయి. ఈ మేరకు శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ముద్రించిన 2024వ సంవ‌త్స‌రం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్త‌క విక్ర‌య‌శాల‌ల్లో భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అదేవిధంగా, ttdevasthanams.ap.gov.in  వెబ్‌సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భ‌క్తులు కొనుగోలు చేయ‌వ‌చ్చని వివరించింది.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

ధ‌ర‌ల వివ‌రాలు:

12 పేజీల క్యాలెండర్ – రూ.130/-, డైరీ(డీలక్స్) రూ.150/-, డైరీ(చిన్న)రూ.120/-, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75/-, 6 పేజీల క్యాలెండర్ రూ.450/-, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి పెద్ద క్యాలెండర్ రూ.20/-, శ్రీ‌వారు మ‌రియు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క్యాలెండర్ రూ.15/-, శ్రీ ప‌ద్మావ‌తి పెద్ద క్యాలెండర్ రూ.20/-, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30/-.

బ‌య‌టి ప్రాంతాల్లో…

చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీ‌వారి ఆల‌యాలు, ముంబ‌యి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం