తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Traffic: నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Vijayawada Traffic: నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu

15 August 2023, 6:17 IST

    • Vijayawada Traffic: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో  నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఉదయం  7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్ళింపు ఉంటుంది. 
కాసేపట్లో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కాసేపట్లో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కాసేపట్లో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Vijayawada Traffic: 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలసులు ప్రకటించారు. ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం విజయవాడలో జరిగే వేడుకల సందర్బంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు వివిధ మార్గాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

ఉదయం 7 గంటల నుండి కంట్రోల్ రూమ్ వైపు నుండి బెంజ్ సర్కిల్ వైపుకు వెళ్ళు అన్నీ వాహనాలను, ఆర్.టి.సి. వై జంక్షన్ నుండి ఏలూరు రోడ్ మీదుగా స్వర్ణ ప్యాలస్ , దీప్తి సెంటర్ పుష్పా హోటల్ ,జమ్మిచెట్టు సెంటరు, సిద్ధార్థ జంక్షను మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు మళ్లిస్తారు.

ఆర్.టి.సి. వై జంక్షన్ నుండి బందర్ లాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్, అమెరికన్ హాస్పిటల్, మసీద్ రోడ్ ,నేతాజీ బ్రిడ్జ్, గీతానగర్, స్క్యూ బ్రిడ్జ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు పంపుతారు.

. బెంజ్ సర్కిల్ వైపునుండి బందర్ రోడ్ లోనికి వచ్చు వాహనములను బెంజ్ సర్కిల్ నుంచి ఫకీర్ గూడెం– స్క్యూ బ్రిడ్జ్- నేతాజీ బ్రిడ్జ్- బస్టాండ్ వైపుకి మళ్ళిస్తారు.

రెడ్ సర్కిల్ నుండి ఆర్.టి.ఎ. జంక్షన్ మరియు శిఖామణి సెంటర్ నుండి వెటరినరీ జంక్షన్ వరకు ఏ విదమైన వాహనములు అనుమతించరు.

బెంజ్ సర్కిల్ నుండి డి.సి.పి. జంక్షన్‌ వరకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు.

ఆర్. టి.సి. సిటీ బస్సుల్ని ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఆర్.టి.సి “వై” జంక్షను నుండి బెంజ్ సర్కిల్ వైపుకు అనుమతించరు.

ఆర్.టి.సి. “వై” జంక్షను నుండి బందరు రోడ్డు మరియు రూట్ .నెం.5 లో వెళ్ళాల్సిన ఆర్.టి.సి. సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ వరకు వెళ్ళి, అక్కడనుండి బెంజ్ సర్కిల్ వైపుకు వెళ్ళాల్సిఉంటుంది.

ఆహ్వానితులకు ప్రత్యేక సూచనలు

“AA, A1, A2, B1, B2”పాస్ కలిగిన ఆహ్వానితుల సౌకర్యార్దం,వారి వాహనాలు ఇందిరా గాందీ స్టేడియంకు వచ్చే మార్గాలు, ప్రవేశించాలసిన మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను నిర్ణయించారు.

’’AA పాస్’’కలిగిన వారు గేట్ నం. 3 (ఫుడ్ కోర్ట్) నుండి ప్రవేశించి అక్కడే నిర్దేశించబడిన స్థలములో పార్కింగ్ చేయాల్సిఉంటుంది.

“A1, A2”పాస్ కలిగిన వారు గేట్ నం. 4 ద్వారా లోపలికి ప్రవేశించి వారి వాహనములను హ్యాండ్ బాల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేయాలి.

“B1, B2మరియు పురస్కార గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు గేట్ నం. 2 ద్వారా ప్రవేశించి ఫుట్ బాల్ గ్రౌండ్ నందు లేదా స్టెడియం కు ఎదురుగా వున్న అర్మేడ్ రిజర్వు గ్రౌండ్ నందు పార్క్ చేయాలి.

సాయంత్ర రాజ్‌భవన్‌లో హైటీ…

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సాయంత్రం ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్‌లో తెనేటి విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ముఖ్యమంత్రి సహా ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమానికి కట్టు దిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా తాతా అధికారుల్ని ఆదేశించారు.

తదుపరి వ్యాసం