తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Traffic Diversion: నేటి అర్థరాత్రి నుంచి విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

Traffic Diversion: నేటి అర్థరాత్రి నుంచి విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపు

Sarath chandra.B HT Telugu

02 January 2024, 12:16 IST

    • Traffic Diversion: విజయవాడ నగర వ్యాప్తంగా నేటి అర్థరాత్రి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. విజయవాడ మీదుగా చెన్నై, కోల్‌కత్తా ప్రయాణించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 
భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Diversion: భవాని దీక్షల విరమణ సందర్భముగా విజయవాడలో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ కాంతిరాణా తాతా ప్రకటించారు. మంగళవారం అర్థరాత్రి నుంచి 07వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయముంలో భవానీ దీక్షల విరమణ నిర్వహించనుండటంతో భక్తులకు, విజయవాడ నగర ప్రజలకు మరియు విజయవాడ మీదుగా ప్రయాణించు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా భారీ వాహనాలు, మధ్య తరహా వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నారు.నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలపాలని పోలీసులు సూచించారు.

1.హైదరాబాద్ నుండి విశాఖపట్నం మరియు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపుకు వెళ్లే భారీ, మద్య తరహా రవాణా వాహనాల రాకపోకలను ఇలా మళ్లిస్తారు.

హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను ఇబ్రహీంపట్నం సర్కిల్‌ నుండి జి కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ మార్గంలోకి మళ్లిస్తారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే రవాణా వాహనాలను కూడా ఈ మార్గంలోకి మళ్లిస్తారు.

2.విశాఖపట్నం నుండి చెన్నై మరియు చెన్నై నుండి విశాఖపట్నం వైపుకు భారీ మరియు మధ్య తరహా రవాణా వాహనాల మళ్లింపు ఇలా చేపడతారు.

హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ – పామర్రు - అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల - త్రోవగుంట – ఒంగోలు జిల్లా మీదుగా రెండు వైపులా మళ్ళిస్తారు.

3.గుంటూరు నుండి విశాఖపట్నం మరియు విశాఖపట్నం నుండి గుంటూరు వైపుకు వెళ్లే భారీ, మధ్య తరహా రవాణా వాహనాలను ఇలా మళ్లిస్తారు.

గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బుడంపాడు వద్ద , తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ , పెనుమూడి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు. విశాఖ నుంచి గుంటూరు వచ్చే వాహనాలను కూడా ఇదే మార్గంలోకి పంపుతారు.

4.చెన్నై నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి చెన్నై వైపుకు భారీ మరియు మధ్య తరహా రవాణా వాహనాలను ఇలా రాకపోకల మళ్లిస్తారు.

చెన్నై నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది.

02వ తేదీ రాత్రి నుండి 07వ తేదీ రాత్రి వరకు

విజయవాడ నుండి హైదరాబాద్, జగ్గయ్య పేట, తిరువూరు వెళ్ళు ఆర్.టి.సి బస్సుల రాకపోకలు ఇలా మళ్లిస్తారు.

హైదరబాద్ నుండి విజయవాడ వైపుకు వచ్చు ఆర్.టి.సి బస్సులు యధావిధిగా గొల్లపూడి వై జంక్షను – స్వాతి జంక్షన్ – కనకదుర్గా ఫ్లైఒవర్ – రాజీవ్ గాంధి పార్క్ – పి.యన్.బి.యస్. ఇన్ గేటు ద్వారా పి.యన్.బి.యస్. లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా అదే మార్గంలో వెళ్లాలి.

విజయవాడ సిటి బస్ స్టాప్ నుండి ఇబ్రహీంపట్నం, భవానిపురం, పాలప్రాజెక్ట్, వై.యస్.ఆర్ కాలనీ వైపు వెళ్ళు ఆర్.టి.సి సిటీ బస్సులు మళ్ళిస్తారు.

వీటిని సిటీ బస్సు టెర్మినల్ – పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ – రాజీవ్ గాంధి పార్క్ – కనకదుర్గా ఫ్లైఒవర్ – స్వాతి జంక్షన్ – వెంకటేశ్వర ఫౌండ్రి – అట్కిన్ సన్ స్కూల్ జంక్షన్ – ఊర్మిళా నగర్ – కబేళా సెంటర్ – సి.వి.ఆర్. ఫ్లై ఓవర్ – మిల్క్ ప్రాజెక్ట్ / వైస్సార్ కాలనీలకు నడుపుతారు. పి.యన్.బి.యస్. ఇన్ గేటు ద్వారా బస్సులు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తిరిగి అదేవిధముగా వెళ్ళవలయును.

సాధారణ వాహనాల మళ్లింపు ఇలా…

02వ తేదీ రాత్రి నుండి 07వ తేదీ వరకు నగరంలో తిరిగే వాహనదారులు ఈ మార్గాలలో ప్రయాణించాల్సి ఉంటుంది.

కనక దుర్గా ఫ్లైఓవర్ మీద నుంచి చిట్టినగర్ టన్నెల్ నుండి గాని భవానిపురం వైపుకు ప్రయాణించాల్సి ఉంటుంది. కుమ్మరిపాలెం నుండి ఘాట్ రోడ్ వైపుకు ఘాట్ రోడ్ నుండి కుమ్మరిపాలెం వైపుకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. తాడేపల్లి నుండి విజయవాడ మరియు విజయవాడ నుండి తాడేపల్లి వైపుకు ప్రకాశం బ్యారేజి మీదుగా ఏ విధమైన వాహనములు అనుమతించరు. హైకోర్ట్, సెక్రటేరియట్ ఉద్యోగులు కనకదుర్గమ్మ వారధి మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం