తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  High Court On Ttd Funds : టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్ కు మళ్లించొద్దు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

High Court On TTD Funds : టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్ కు మళ్లించొద్దు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

13 December 2023, 18:37 IST

    • High Court On TTD Funds : టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు మళ్లించొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
టీటీడీ నిధుల మళ్లింపు కేసు
టీటీడీ నిధుల మళ్లింపు కేసు

టీటీడీ నిధుల మళ్లింపు కేసు

High Court On TTD Funds : తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు మళ్లిస్తున్నారని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టీటీడీ నిధులు తిరుపతిలో రోడ్లు, పారిశుద్ధ్యం కోసం వినియోగించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్ వాదనలు వినిపిస్తూ... టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం ప్రకారం విరుద్ధమన్నారు. టీటీడీ చెందిన రూ.100 కోట్లు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మళ్లించారని అభియోగించారు. గతంలో ఎప్పుడూ ఇలా టీటీడీ నిధులు మళ్లించలేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ...తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్యం పనులకు టీటీడీ నిధులు మళ్లించొద్దని ఆదేశించింది. అదే విధంగా కాంట్రాక్టర్లకు సొమ్ము విడుదల చేయొద్దని తెలిపింది. కానీ టెండర్‌ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని టీటీడీకి స్పష్టం చేసింది. ఈ కేసులో రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. టీటీడీ బడ్జెట్‌ నుంచి తిరుపతి అభివృద్ధికి ఏటా ఒక్క శాతం నిధులు ఖర్చు చేసేందుకు ఇటీవల టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. దీంతో ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.

రూ.100 కోట్లు విడుదలకు టీటీడీ ఆమోదం

తిరుపతి కార్పొరేషన్‌లోని రోడ్లు, కాలనీలలో పారిశుద్ధ్యం పనులకు టీటీడీ నిధులు వినియోగించాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకు గాను ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు టీటీడీ ఈవో ఆమోదం తెలిపారు. ఈ పనుల నిర్వహణకు నవంబర్ 22న టెండర్లు ఆహ్వానించారు. టెండర్లు స్వీకరించేందుకు డిసెంబరు 7ను చివరి తేదీగా నోటిఫికేషన్ లో తెలిపారు. డిసెంబర్ 16న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో బిడ్లు ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రక్రియను నిలిపివేయాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. భక్తుల కానుకలు, విరాళాల ద్వారా వచ్చిన నిధులను దేవాదాయ చట్టంలోని సెక్షన్ 111 ప్రకారం ఖర్చు చేయాల్సి ఉంటుంది. టీటీడీ నిర్వహణ, హిందూ ధర్మం పరిరక్షణ, భక్తుల సౌకర్యాల కోసం సొమ్ము వినియోగించాలి. ఏ ఇతర పనులకు నిధులు మళ్లించడానికి వీల్లేదని చట్టం చెబుతోంది. గతంలో ఇదే తరహాలో తిరుపతిలో రహదారి సుందరీకరణకు టీటీడీ రూ.10 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు అవ్వడంతో టీటీడీ అప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

తదుపరి వ్యాసం