తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam Project : శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం... తాజా పరిస్థితి ఇదే

Srisailam Project : శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం... తాజా పరిస్థితి ఇదే

06 August 2023, 7:19 IST

    • Krishna River Updates: కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద  క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 860 అడుగులు దాటింది. 
శ్రీశైలం ప్రాజెక్ట్
శ్రీశైలం ప్రాజెక్ట్

శ్రీశైలం ప్రాజెక్ట్

Srisailam Project Water Levels: కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీనికితోడు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది., దీంతో జురాల, శ్రీశైలం ప్రాజెక్ట్ లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

జూరాల ప్రాజెక్టు నుంచి 36 వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం దిగువకు తరలివస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయ నీటిమట్టం 860.20 అడుగులకు చేరింది. నీటినిల్వ 106 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో… నీటినిల్వలు క్రమంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్‌ నిండాలంటే 885 అడుగులకు నీరు చేరాలి. తాజా పరిస్థితి చూస్తే.. ఇప్పట్లో గేట్లు ఎత్తే పరిస్థితి లేదు. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగాని శ్రీశైలం నిండే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే గేట్లు ఎత్తనున్నారు. సాధారణంగా భారీ వర్షాల నేపథ్యంలో.. శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని టూరిస్టులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు.. భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇక నాగార్జున సాగర్ లో చూస్తే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 514.8గా నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 139 టీఎంసీల నీటి నిల్వ ఉండగా... ప్రస్తుతం ఇన్ ఫ్లో నిలిపివేశారు. 1350 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ లో ఆదివారం ఉదయం 7 గంటలకు చూస్తే... ప్రస్తుతం నీటిముట్టం 167.52 అడుగులుగా ఉంది. 34 టీఎంసీల నీరు నిల్వ ఉండగా...1,467 క్యూసెకుల ఇన్ ఫ్లో ఉంది.5,000 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

తదుపరి వ్యాసం