తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Jagan Birthday Wishes: సీఎం జగన్​ బర్త్​ డే.. చంద్రబాబు ట్వీట్, ఏం చెప్పారంటే

YS Jagan Birthday Wishes: సీఎం జగన్​ బర్త్​ డే.. చంద్రబాబు ట్వీట్, ఏం చెప్పారంటే

HT Telugu Desk HT Telugu

21 December 2022, 16:03 IST

    • CM Jagan Birthday: సీఎం జగన్ 50వ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకు ప్రధానితో పాటు ఇతర రాజకీయ నేతలు, ప్రముఖలు విషెస్ చెబుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. పవన్ కూడా విషెస్ చెప్పారు.
జగన్ బర్త్ డే.. చంద్రబాబు ట్వీట్
జగన్ బర్త్ డే.. చంద్రబాబు ట్వీట్

జగన్ బర్త్ డే.. చంద్రబాబు ట్వీట్

Birthday Wishes to CM YS Jagan: ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ శ్రేణులు పండగలా జరుపుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు జన్మదిన కేక్ లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రులు, అధికారులు కూడా ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి విషెస్ చెప్పారు. కేక్ కట్ చేయించి... పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

మరోవైపు రాష్ట్రంలోని పట్టణాలు, జిల్లా, మండల కేంద్రాల్లో సేవా కార్యక్రమాల్లో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఇక చాలాచోట్ల ప్రత్యేక రక్తదాన శిబిరాలు, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. ఇదేగాక సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపేలా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలోనూ హోరెత్తిస్తున్నారు. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్ మంగళవారం రాత్రి నుంచి ట్రెడింగ్ లో ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. బ'ర్త్ డే గ్రీటింగ్స్ టూ వైఎస్ జగన్' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే గతేడాది కూడా సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్... పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సీనీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ కేక్ కట్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీటీడీ వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.

తదుపరి వ్యాసం