తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు

Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు

21 August 2023, 20:17 IST

    • Trains Cancelled : తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. గుండాల వద్ద ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేశారు.
రైళ్లు రద్దు
రైళ్లు రద్దు

రైళ్లు రద్దు

Trains Cancelled : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు అయ్యాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఖుర్దా రోడ్ మూడో లైన్ కు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేస్తున్నారు. భువనేశ్వర్‌, మంచేశ్వర్‌, హరిదాస్‌పుర్‌, ధన్‌మండల్‌ సెక్షన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 21 నుంచి 29 వరకు 75 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. మరోవైపు భువనేశ్వర్‌-ముంబయి, హౌరా-సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ మధ్య ఆరు రైళ్లను ఈ నెల 24 నుంచి 30 వరకు భువనేశ్వర్‌కు బదులుగా ఖుర్దా రోడ్‌ నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ సెక్షన్‌లో గుండాల వద్ద ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా మరో 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Gopi Thotakura: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రవాసాంధ్రుడు.. భూ కక్ష్య వెలుపలికి విజయవాడ యువకుడి ప్రయాణం

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో 52 రైళ్లు రద్దు

తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించే మొత్తం 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. గుండాల-విజయవాడ సెక్షన్‌ పరిధిలో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు వివిధ తేదీల్లో రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్‌-విశాఖపట్నం మార్గంలో జన్మభూమి, గరీబ్‌రథ్‌ సహా తిరుపతి- భువనేశ్వర్‌, విశాఖ-చెన్నై,హైదరాబాద్‌- కటక్‌ రైళ్లు ఉన్నాయి. విజయవాడ- మచిలీపట్నం, విజయవాడ-నర్సాపురం మధ్య నడిచే పలు రైళ్ల స్టాప్‌లను మార్చినట్లు అధికారులు తెలిపారు.

రైళ్లు మళ్లింపు

విజయవాడ డివిజన్‌లో భద్రతా నిర్మాణ పనులు కారణంగా ఈనెల 21 నుంచి 27 వరకు రాజమండ్రి-విశాఖ (07466), విశాఖ- రాజమండ్రి (07467), కాకినాడ- విశాఖ (17247), విశాఖ- కాకినాడ (17268) ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ (22643), ఈ నెల 23, 24 తేదీల్లో బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్‌ (12509), ఈ నెల 27న కొయంబత్తూర్‌-సిలిచర్‌ ఎక్స్‌ప్రెస్‌(12515) రైళ్లను వయా నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లించారు.

తదుపరి వ్యాసం