తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sajjala On Kcr Comments : ఎన్నికల కోసమే కేసీఆర్‌ వ్యాఖ్యలు - సజ్జల కౌంటర్

Sajjala On KCR Comments : ఎన్నికల కోసమే కేసీఆర్‌ వ్యాఖ్యలు - సజ్జల కౌంటర్

02 November 2023, 21:03 IST

    • Sajjala Ramakrishna Reddy On KCR : ఏపీలోని రోడ్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ అలా వ్యాఖ్యానించినట్లు ఉందంటూ కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ వ్యాఖ్యలు - సజ్జల రియాక్షన్
కేసీఆర్ వ్యాఖ్యలు - సజ్జల రియాక్షన్

కేసీఆర్ వ్యాఖ్యలు - సజ్జల రియాక్షన్

Sajjala Ramakrishna Reddy On KCR : తెలంగాణ సరిహద్దులో ఉన్న ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తామంటున్నారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలోని రోడ్లపై ఇటీవలే సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందిస్తూ…. ఎన్నికల కోసమే కేసీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

ఏడు విలీన మండలాల్లో ఓ సర్వే చేస్తే.. అక్కడి ప్రజలు ఏపీలోనే ఉంటామంటున్నారట. తెలంగాణలోకి పొరపాటున కూడా వెళ్లామని చెప్పారట. ఏపీలోనే అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారట. ఇక కేసీఆర్ ఎన్నికల కోసమే ఏపీలోని రోడ్లపై వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలోనే పెన్షన్ల విషయంలో జగన్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశంసించారు. ఎక్కడ ఏం చేశామో మాకు తెలుసు. సమూలంగా మార్పులు తీసుకొచ్చే పథకాలను తీసుకువచ్చాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం" అంటూ సున్నితంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు సజ్జల.

కేసీఆర్ ఏమన్నారంటే..?

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలో పర్యటించారు కేసీఆర్. బీఆర్ఎస్ సభలో మాట్లాడిన ఆయన… ఏపీ రోడ్ల దుస్థితిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ రోడ్లు, తెలంగాణ రోడ్లను చూసి బేరీజు వేసుకుని ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు…. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.

తదుపరి వ్యాసం