తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sajjala On Cbn Reports : చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? లేక పొలిటికల్ డాక్టర్లా? - సజ్జల కీలక వ్యాఖ్యలు

Sajjala On CBN Reports : చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? లేక పొలిటికల్ డాక్టర్లా? - సజ్జల కీలక వ్యాఖ్యలు

16 November 2023, 20:12 IST

    • Sajjala On CBN Medical Reports : చంద్రబాబుకు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది డాక్టర్లా లేక పొలిటికల్ డాక్టర్లా? అంటూ కామెంట్స్ చేశారు సజ్జల. వాళ్లిచ్చిన నివేదిక ప్రకారం అయితే చంద్రబాబు బెడ్‌ మీదుండాలని అన్నారు.  
సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి (Facebook)

సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala On CBN Medical Reports : చంద్రబాబుకి ఆనారోగ్యం రీత్యా తాత్కాలికంగా కోర్టు కండీషనల్ మెడికల్‌ బెయిల్‌ ఇచ్చిందన్నారు సజ్జల. మరోవైపు ప్రధాన బెయిల్‌పై కూడా వాదనలు నడుస్తున్నాయని…. మరింత కాలం ఆయన బయట ఉండటానికి వీలుగా ఒక మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చినట్లు అర్ధమవుతోందన్నారు. ఎవరైనా జబ్బుతో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించడం వారి హక్కు అని… కోర్టు స్పెషలిస్టు వైద్యులు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకోవడం సహజం. దానిలో తప్పు లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Inter Admissions: రేపటి నుంచి ఏపీ ఇంటర్ తొలిదశ అడ్మిషన్లు, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం

SIT Report to Ec: ఏపీ ఎన్నికల ఘర్షణల్లో 1370మంది నిందితులు, 124మంది అరెస్ట్, కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నివేదిక

Jaya Badiga: కాలిఫోర్నియా శాక్రిమెంటో సుపిరీయర్‌ జడ్జిగా తెలుగు మహిళ బాడిగ జయ నియామకం..

AP TG Weather Updates: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, జూన్‌ మొదటి వారంలోనే రుతుపవనాల రాక

"ఎవరైనా ఒక వ్యక్తి ఆరోగ్య పరమైన సమస్యలతో ఉన్నప్పుడు కామెంట్‌ చేయడం కూడా సరికాదు. వాటిని నేను ఖచ్చితంగా పాటించే వ్యక్తిగానే మాట్లాడుతున్నాను. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే.. ఇప్పటివరకూ మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలా వ్యవహరిస్తూ...రిపోర్టులు మాత్రం వేరే విధంగా ఉంటే అనేక అనుమానాలు వస్తాయి. ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉండి, ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన వ్యక్తిగా, సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఎవరైనా అన్నీ సునిశితంగా పరిశీలిస్తారు. అంతకు ముందువరకూ చంద్రబాబుకు వయసుతో పనిలేదు. ఆయన నవ యువకుడు అని మాట్లాడిన వ్యక్తులు... ఇప్పుడు మాత్రం చర్మవ్యాధులు కూడా ప్రాణాంతకం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయినా కోర్టు మానవత్వంతో మధ్యంతర బెయిల్‌ ఇచ్చి నీకు ఇష్టం వచ్చిన వైద్యునితో వైద్యం చేయించుకోమని చెప్పింది. ఆయన జైల్లో నుంచి బయటకు రాగానే 14 గంటలకు పైగా ప్రయాణం చేసుకుంటూ...కార్యకర్తలు వచ్చే వరకూ వెయిట్‌ చేసి మరీ మరుసటి రోజు ఉదయం గమ్యానికి చేరాడు. కరకట్ట నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లారు. ఇవన్నీ చూస్తే కామెంట్‌ చేయకతప్పడం లేదు. ఇప్పుడేమో, అక్కడ రాజకీయ భేటీలు నిర్వహిస్తున్నారు.

డాక్టర్లా...లేక పొలిటికల్‌ డాక్టర్లా..?:

"జైల్లో ఉన్నప్పుడు.. కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్ చేయకపోతే కళ్లు పోతాయి అన్నట్లుగా, చర్మవ్యాధులకు చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుంది.. అన్నట్లుగా వ్యవహరించి హైదరాబాద్‌ వెళ్లారు. ఏఐజీ ఆస్పత్రి వారు ఆయన ప్రజాజీవితాన్ని పరిగణలోకి తీసుకుని ఆయన వెంట గుండె జబ్బులకు సంబంధించిన అంబులెన్స్‌ 24x7 ఉండాలని నివేదిక ఇచ్చారు. దాన్ని చూస్తే వీళ్లు అసలు వైద్యులా...లేక పొలిటికల్‌ డాక్టర్లా అనే ప్రశ్న ఉత్పన్నమువుతుంది. చికిత్స కోసం ఓ పేషెంట్‌ వస్తే...ఆయన ఎక్కడకు పోతే అక్కడకు ఒక అంబులెన్స్‌ ఉండాలని విచిత్రమైన నివేదిక ఇచ్చారంటే ఎవరికైనా ఏం అర్ధం అవుతోంది..? ఇక ఆయన గుండెకు సంబంధించిన నివేదికను చూస్తే...నాకు తెలిసిన కార్డియాలజిస్టును అడిగితే.. ఆ నివేదిక ప్రకారం వెంటనే స్టంట్‌ వేయాలి..లేకపోతే ఆస్పత్రిలో చేర్చి పర్యవేక్షించాలని చెప్పారు. స్టంట్, బైపాస్‌ అనేది డిసైడ్‌ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నట్లు డాక్టర్లు ఆ నివేదిక ఇచ్చారు. చర్మవ్యాధుల నివేదికను చూస్తే క్యాన్సర్‌ వచ్చే పరిస్థితి ఉందని, రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని రాశారు. ఆయన హిస్టరీలో క్యాన్సర్‌ పరిస్థితి ఉంటే ముందే తేలాలి..కానీ అకస్మాత్తుగా ఇప్పుడు బయటకు వచ్చింది. వీళ్లు చూపే నివేదికలను చూస్తే ఇమిడియట్‌గా ఆస్పత్రిలో చేర్చి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. అంత సీరియస్ గానే ఉంటే.. వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలి అని నివేదిక ఇవ్వొచ్చు. కానీ పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నాడు కాబట్టి ఈయన ఎక్కడికంటే అక్కడికి అంబులెన్స్‌ పెట్టుకుని తిరగొచ్చు అని నివేదిక ఇవ్వడం విచిత్రంగా ఉంది. క్యాన్సర్‌ ఉందో లేదో తేల్చడం కోసం మరిన్ని పరీక్షలు చేయాలంటే .. సింప్టమ్స్‌ ఉంటే రూల్‌ అవుట్‌ చేయడం వేరు...ఉన్నాయేమో పరీక్షలు చేయాలి అని చెప్పడం కూడా చిత్రంగా ఉంది.

చంద్రబాబు చాకచక్యమా.. డాక్టర్లు పరిధి దాటారా..?

“అందరికీ జబ్బులు వస్తుంటాయి. పైగా జైళ్లో ఉన్న వాళ్లకు, 70 ఏళ్లు పైబడిన వారికి అందరికీ సమస్యలు వస్తుంటాయి. అందరికీ టెస్టులు చేసి ఇలానే నివేదికలు వస్తుంటాయా..? అలానే పంపిస్తుంటారా అలాంటి నివేదికలు తెచ్చుకోవడం చంద్రబాబు చాకచక్యమా..? లేక డాక్టర్లు తమ పరిధి దాటి నివేదికలు ఇచ్చారా? . దీంట్లో మేనేజ్‌మెంట్‌ కనిపిస్తోంది. అది మా తప్పా..? అది నివేదికలోనే కనిపిస్తోంది.కంటి విషయంలోనూ అంతే...కంటి పరీక్షలు చేయించుకున్న వారు ఐదు వారాలు రెస్ట్‌లో ఉండాలి అంటారు. మరి చాలా మందికి కంటి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి...ఐడ్రాప్స్‌ ఇస్తుంటారు..వేసుకుంటారు. కంటి చికిత్స చేయించుకోవడానికి ఇచ్చిన బెయిల్‌ను డాక్టర్లే పబ్లిక్‌ లైఫ్‌లో అంబులెన్స్‌లో తిరగాలి అని నివేదిక ఇవ్వడం విచిత్రంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి తనకు తాను తెచ్చుకున్నాడు. నాకు శక్తి తగ్గలేదని ఓ పక్క చెప్పుకుంటూ..మరో పక్క ఇప్పుడు సర్జరీ చేయకపోతే మనిషి ఉంటాడా.. పోతాడా అనే విధంగా నివేదికలు తెప్పించుకుంటున్నాడు. అదే నిజమే అయితే ఆయన ఇమిడియట్‌గా ఆస్పత్రిలో బెడ్‌ మీద ఉండాలి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్ధిస్తాం. ఆయన జైళ్లో ఉండాలని మేమేం కోరుకోవడం లేదు. ఆయన పబ్లిక్‌ లైఫ్‌లో ఉండాలి. ఆయన పబ్లిక్‌ లైఫ్‌ను ఫేస్‌ చేయాలి..ఆయన చేసిన మోసాలకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. ఆయన లోపల ఉండటం వల్ల మాకొచ్చే లాభం ఏమీలేదు.. ఈ మొత్తం వ్యవహారంలో అసలు చేసిన స్కాం పక్కకు పోతోంది. మొన్నటివరకూ జైల్లో దోమలని, ఆయన ఆరోగ్యం అని, సింపతీ గేమ్‌ మొదలు పెట్టారు. ఎక్కడా కూడా ఈ స్కాం.. నేను చేయలేదని ప్రూవ్‌ చేసే ప్రయత్నాలు చేయడం లేదు. ఇకొంచెం కాలం ఎలా బెయిల్‌ తెచ్చుకోవాలి అనేదే వారు చేస్తున్న ప్రయత్నం. బాబుకో న్యాయం..జైళ్లో ఉన్న ఖైదీలకో న్యాయమా? ఇవన్నీ చూస్తుంటే.. చంద్రబాబుకో న్యాయం.. జైల్లో ఉన్న ఖైదీలకు ఒక న్యాయమా?. మిగతావాళ్లకు లేని పరిష్కారం మరొకరికి ఎందుకుంటుందో అర్ధం కావడం లేదు” అన్నారు సజ్జల.

మేనిఫెస్టో అంటే నిర్వచనం తెలుసా..?

“టీడీపీ, జనసేనలు మేనిఫెస్టో అంటూ కొత్త నాటకానికి తెరలేపారు. రెండు దేశాల అగ్రనాయకులు కూర్చుని చర్చించుకున్నట్లు రెండు గ్రూపుల మధ్య జెండాలు పెట్టుకుని డ్రామాలు వేస్తున్నారు. రాష్ట్రాన్ని జగన్‌ గారి నుంచి విముక్తి చేయాలని చర్చించుకున్నాం అంటున్నారు. టీడీపీ ఇచ్చిన 6 హామీలకు మరో ఐదు జనసేన వాళ్ళు జతచేశారట. అసలు జనం చెవుల్లో పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు పెట్టాలని వీళ్లు ప్రయత్నం చేస్తున్నారు. అసలు మేనిఫెస్టో అంటే నిర్వచనం ఏంటో కూడా వారికి తెలుసా..? అసలు టీడీపీ మేనిఫెస్టోకు ఉన్న విశ్వసనీయత ఎంత..? తానిచ్చిన మేనిఫెస్టోను చివరకు వెబ్‌సైట్లో కనపడకుండా చేసిన ఘన చరిత్ర చంద్రబాబుకు ఉంది. మేనిఫెస్టోలో స్పష్టమైన హామీలు ఏమైనా ఉన్నాయా..? రాష్ట్ర ప్రజలంటే వీరికి ఎంత ఎగతాళి అయిందో మేనిఫెస్టో పేరుతో వారి డ్రామాలను చూస్తే అర్ధం అవుతోంది. మరోపక్క ఆలూ.. చూలు లేకుండానే రెండు పార్టీల వారు కొట్టుకుంటన్నారు. అసలు మేనిఫెస్టోలో ఆ సీరియస్‌నెస్‌ లేదు. ఆ రెండు పార్టీల సమైఖ్య భేటీలో కొట్లాడుకోవడం రోజూ పరిపాటిగా మారింది. ఒకే సారి ఎంతమందితో పవన్ సంసారం చేయగలడు..?: ఎన్నికలు జరుగుతున్న పక్క రాష్ట్రంలో మరో డ్రామా నడుస్తోంది. ఇక్కడేమో టీడీపీ, జనసేన పొత్తు ఒక డ్రామా అయితే అక్కడ మాత్రం బీజేపీ, జనసేన పొత్తు. టీడీపీ మేం పోటీలో లేమంటూనే కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతూ ఓపెన్‌గానే తిరుగుతున్నారు. ఇక్కడ పొత్తు కుదిరినప్పుడు అక్కడెందుకు కుదర్లేదు..? ఇక్కడ టీడీపీతో ఉన్న వాడు అక్కడ బీజేపీతో ఎలా వెళ్లాడు..? - ఒకే సారి ఎంతమందితో సంసారం చేయగలడు..? మరో వైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు ఎజెండా ఎత్తుకుని తిరుగుతున్నారు. ఈ మొత్తం రాజకీయ ముఖచిత్రంలో చంద్రబాబు మనుషులే కనిపిస్తున్నారు. బీజేపీలో పురంధేశ్వరి, జనసేన నాదెండ్ల మనోహర్‌లు మాత్రమే కనిపిస్తున్నారు. తెలంగాణలో సీట్లు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఎక్కడా తిరగడం లేదు.పవన్‌ కల్యాణ్, చంద్రబాబులకు నిజంగా ఏపీపై చిత్తశుద్ధి ఉంటే వారు వ్యవహరించే తీరు ఇదేనా? మేం మోసం చేసినా మీరు ఏం చేయలేరు...ఆ సత్తా మాకుంది అనే రీతిలో బరితెగింపుతో వెళ్తున్నారు. వారికి ప్రజలపై ప్రేమ, అభిమానం కనిపిస్తుందా..?” అంటూ సజ్జల ప్రశ్నించారు.

తదుపరి వ్యాసం