తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పరాభవం.. కన్నబాబు రాజు, శంకరనారాయణలకు నిరసన సెగలు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పరాభవం.. కన్నబాబు రాజు, శంకరనారాయణలకు నిరసన సెగలు

HT Telugu Desk HT Telugu

01 May 2023, 12:43 IST

    • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు పరాభవం ఎదురైంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎమ్మేల్యే శంకరనారాయణలకు నిరసన సెగలు ఎదురయ్యాయి.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు నిరసనలు
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు నిరసనలు

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు నిరసనలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు ఉద్రిక్తంగా మారాయి. యలమంచిలి, పెనుగొండ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

యలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగలు ఎదురయ్యాయి. ప్రజలు, సొంత పార్టీ నేతలు అడ్డుకున్నారు.

యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు రాజును సమస్యలపై స్థానికులు నిలదీశారు. కన్నబాబురాజు పోవాలి.. జగన్ రావాలంటూ నినాదాలు చేశారు. జనం ప్రశ్నిస్తుంటే సహనం కోల్పోయిన కన్నబాబు రాజు వారిపై చేయి చేసుకున్నారు. పూడిమడక గ్రామంలో గడప గడపకూ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. జనం గోబ్యాక్ అంటూ నినదించారు.

పెనుగొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఈదులపాలపురం వెళ్లగా.. జనం సమస్యల చిట్టా విప్పి నిరసన వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మౌనంగా అక్కడ నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోతుండడంతో స్థానికులు ఎమ్మెల్యే కారుపై చెప్పులు విసిరారు.

తదుపరి వ్యాసం