తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Srisailam Fire Accident: శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం… కోట్లలో ఆస్తి నష్టం

Srisailam Fire accident: శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం… కోట్లలో ఆస్తి నష్టం

HT Telugu Desk HT Telugu

31 August 2023, 7:07 IST

    • Srisailam Fire accident: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరిగిన  అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.  ఎల్ బ్లాక్‌  షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అర్థరాత్రి మంటలు చెలరేగడంతో దుకాణాలు కాలి బూడిద అయ్యాయి. 
శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం
శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం

Srisailam Fire accident: శ్రీశైలంలోని లలితాంబికా షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఎల్ బ్లాకు దుకాణాల్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో 15 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.- అగ్నిప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీశైలం దేవస్థానంలో బుధవారం అర్దరాత్రి దాటిన తర్వాత దుకాణాల్లో మంటలు చెలరేగాయి. లలితాంబికా కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాలు మొత్తం కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో 12 దుకాణాలు కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక యంత్రాలతో అదుపులోకి తెచ్చేందుకు శ‌రమించారు. శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌తోనే ఈ మంటలు చెలరేగినట్టు చెబుతున్నారు. దుకాణాలు పూర్తిగా దగ్ధమైపోవడంతో వాటి నిర్వాహకులు కన్నీరు మున్నీరయ్యారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో దుకాణాల్లో సామాను బయటకు తీసే అవకాశం కూడా లేకుండా పోయింది.

లలితాంబికా కాంప్లెక్స్‌లో దుకాణాలు వరుసగా ఉన్నా ఏక కాలంలో మంటలు చెలరేగడంతో పాటు, ప్రతి దుకాణంలో భారీగా స్టాకు ఉండటంతో నష్టం భారీగా ఉంది. పండుగల సీజన్‌ కావడంతో వ్యాపారాల కోసం తెచ్చుకున్న సరుకు మొత్తం కాలి బూడిదైందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

తదుపరి వ్యాసం