తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mp Sanjiv Kumar : వైసీపీకి మరో షాక్, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా!

MP Sanjiv Kumar : వైసీపీకి మరో షాక్, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా!

10 January 2024, 20:19 IST

    • MP Sanjiv Kumar : వైసీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు.
ఎంపీ సంజీవ్ కుమార్
ఎంపీ సంజీవ్ కుమార్

ఎంపీ సంజీవ్ కుమార్

MP Sanjiv Kumar : వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో సంజీవ్ కుమార్ మనస్తాపం చెందారు. దీంతో తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సంజీవ్ కుమార్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సంజీవ్ కుమార్ అన్నారు. తన సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. మరో 20 ఏళ్ల వరకు తాను ప్రజా జీవితంలో ఉంటానన్నారు. ఎంపీగా అభివృద్ధి చేసే అవకాశం తనకు రాలేదన్నారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానన్నారు. వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో నిర్ణయాలు జరగాలన్నారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావన్నారని ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

ఇన్ ఛార్జ్ మార్పులతో వివాదం

వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పులు కొనసాగుతున్నారు. అధిష్టానం నిర్ణయాలతో ఏకీభవించని నేతలు ప్రత్యక్షంగా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. కొందరు నేతలు పార్టీని వీడేందుకు నిర్ణయించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల దక్కవని భావించిన నేతలు తమ భవిష్యత్తు కార్యకరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగా, ఇటీవల మరో ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీని విడారు. తాజాగా ఎంపీ సంజీవ్ కుమార్ సైతం అదే బాటలో నడిచారు. వీటితో పాటు మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులపై కసరత్తు చేస్తున్న వైసీపీ ఇప్పటికే రెండు జాబితాల్లో 38 మంది ఇన్ ఛార్జ్ లను మార్చింది. వైసీపీలో నియోజకవర్గ సమన్వయ కర్తలకే అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తారు. దీంతో ఇన్ ఛార్జ్ పదవి వస్తే టికెట్ దక్కినట్లేనని నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ విడుదలైన రెండు జాబితాల్లో పేర్లు లేని నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. అయితే కొందరు నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.

టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి!

కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీ వైపు చూస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్థసారధిని తప్పించాలని భావిస్తున్నట్లు పార్టీ సమాచారం ఇచ్చింది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. గత వారం సామాజిక సాధికార యాత్రలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ తర్వాత పార్థసారధికి నచ్చ చెప్పే ప్రయత్నాలు జరిగాయి. టిక్కెట్‌ కేటాయించే పరిస్థితులు లేవని తేలిపోవడంతో పార్థసారథి తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి సారథికి ఆఫర్ లభించినట్టు తెలుస్తోంది. పెనమలూరు సీటును వదులుకుని నూజివీడుకు వెళితే ఎన్నికల బాధ్యత మొత్తం టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన పార్థసారథి వైసీపీలో తగిన ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తితో ఉన్నారు. 2014లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసిన సారథి, 2019లో పెనమలూరు నుంచి పోటీ చేశారు. గత వారం పదిరోజులుగా పార్టీతో అంటిముట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో సారథిని బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నించారు.

తదుపరి వ్యాసం