తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Indrakeeladri Bhavani Deekshalu: నవంబర్ 23నుంచి భవానీ దీక్షల ప్రారంభం

Indrakeeladri Bhavani Deekshalu: నవంబర్ 23నుంచి భవానీ దీక్షల ప్రారంభం

Sarath chandra.B HT Telugu

03 November 2023, 8:24 IST

    • Indrakeeladri Bhavani Deekshalu: భక్తుల కొంగు బంగారమైన బెజవాడ దుర్గమ్మ మీద భక్తితో లక్షలాది మంది భక్తులు చేపట్టే భవానీ దీక్షలు ఈ ఏడాది నవంబర్ 23నుంచి ప్రారంభం కానున్నాయి.  భవానీ మండల దీక్షల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు ప్రకటించారు. 
నవంబర్ 23 నుంచి భవానీ దీక్షలు
నవంబర్ 23 నుంచి భవానీ దీక్షలు

నవంబర్ 23 నుంచి భవానీ దీక్షలు

Indrakeeladri Bhavani Deekshalu: ఇంద్రకీలాద్రిపై నవంబర్‌ 23 నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్‌.రామారావు తెలిపారు. ఆలయం మహామండపం వైదిక కమిటీ సభ్యులతో కలిసి భవానీ దీక్షల వివరాలను వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

కనకదుర్గమ్మపై భక్తితో చేపట్టే దీక్షలను నవంబర్ 23నుంచి 27వరకు స్వీకరించవచ్చని తెలిపారు. అమ్మవారిపై భక్తితో దసరా సమయంలో భక్తులు భవానీ దీక్షలు చేపట్టే వారు. 2007లో భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత మండల దీక్షలను విడిగా నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఏటా అమ్మవారి దీక్షలు ధరిస్తుంటారు. ఏటేటా దీక్షలు స్వీకరించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో భవానీ దీక్షలకు ఇంద్రకీలాద్రిపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తు్నారు.

నవంబర్‌ 23న అమ్మవారి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించి పగడాల మాలాధారణ చేస్తారని, అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం ప్రారంభమవుతుందని వివరించారు.

అర్ధమండల దీక్షలు డిసెంబర్‌ 13-17 వరకు స్వీకరించవచ్చని ఈవో తెలిపారు. 26న అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 3-7 వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయని తెలిపారు.

14 నుంచి కార్తీక మాసోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి డిసెంబర్‌ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షణ, బిల్వార్చన చేపడతారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న సరస్వతి యాగాన్ని, 17న నాగుల చవితి నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం