తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Tirupati Karnataka Tour: తిరుపతి టు గోకర్ణ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ఇదే

IRCTC Tirupati Karnataka Tour: తిరుపతి టు గోకర్ణ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ఇదే

14 September 2022, 9:48 IST

    • tirupati coastal karnataka tour package: తిరుపతి నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
తిరుపతి కర్ణాటక టూర్
తిరుపతి కర్ణాటక టూర్ (www.irctctourism.com)

తిరుపతి కర్ణాటక టూర్

irctc tourism announced tirupati coastal karnataka tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా తిరుపతి నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'COASTAL KARNATAKA EX RENIGUNTA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో గోకర్ణ, కొల్లూరు, మంగళూరు, మురుదేశ్వర్, శృంగేరి, ఉడిపి వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

AP SSC Supplementary Exams : ఏపీ పదో తరగతి సప్లిమెంటరీకి సర్వం సిద్ధం, 685 పరీక్ష కేంద్రాల్లో మే 24 నుంచి ఎగ్జామ్స్!

Tirumala VIP Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్ల జారీ తిరిగి ప్రారంభం

Nandi Hills Tour : నంది హిల్స్ -వీకెండ్ ట్రిప్ బెస్ట్ స్పాట్, ప్రశాంతతను పలకరించండి!

AP Inter Admissions: రేపటి నుంచి ఏపీ ఇంటర్ తొలిదశ అడ్మిషన్లు, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం

tirupati coastal karnataka tour: ఈ నెల సెప్టెంబర్ 27వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01 Tuesday: కడప నుంచి మధ్యాహ్నం 02.30 నిమిషాలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 04.50 నిమిషాలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day 02 Wednesday: ఉదయం 09.30 నిమిషాలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... శ్రీకృష్ణ టెంపుల్, సెయింట్ మెరీస్ ఐల్యాండ్, మల్పి బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.

Day 03 Thursday: హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత... శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ్నుంచి కొల్లూరులోని మూకాంబికా ఆలయానికి వెళ్తారు. అనంతరం మురుదేశ్వర్ కు పయనమవుతారు. హెటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... రాత్రి మురుదేశ్వర్ లోనే బస చేస్తారు.

Day 04 Friday: జోగ్ వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మధ్యాహ్నం గోకర్ణకు బయల్దేరుతారు. ఆలయంతో పాటు బీచ్ కు వెళ్తారు. తిరిగి మురుదేశ్వర్ కు వస్తారు. రాత్రి అక్కడ బస చేస్తారు.

Day 05 Saturday: చెక్ అవుట్ అయి మంగళూరుకు చేరుకుంటారు. కాటేల్ ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు వస్తారు. మంగళాదేవి ఆలయానికి వెళ్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 నిమిషాలకు రైలు బయల్దేరుతుంది.

Day 06 Sunday: మధ్యాహ్నం 12.05 రేణిగుంట, 01.53కు కడప చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ధరలివే.....

tirupati karnataka tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 33,280ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 18,570 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,480 గా ఉంది. 3 టైర్ ఏసీ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

<p>ధరల వివరాలు</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం