తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Thailand Tour : థాయ్‌ల్యాండ్ వెళ్తారా.. వైజాగ్ నుంచి టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Thailand Tour : థాయ్‌ల్యాండ్ వెళ్తారా.. వైజాగ్ నుంచి టూర్ ప్యాకేజీ ఇదే

HT Telugu Desk HT Telugu

06 November 2022, 21:56 IST

    • IRCTC Thailand Tour Details : ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. థాయ్‌ల్యాండ్ వెళ్లి రావాలనుకునేవారి కోసం ప్యాకేజీని ప్రకటించింది. బ్యాంకాక్, పట్టాయా లాంటి ప్రదేశాలు చూసి రావొచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం నుంచి థాయ్‌ల్యాండ్(Visakhapatnam To Thailand) టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ(Tour Package) ఉపయోగపడుతుంది. అయితే దేశంలోని ప్రాంతాలతోపాటుగా విదేశాల్లోని.. కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోంది. ఫ్యాసినేటింగ్ థాయ్‌ల్యాండ్(Fascinating Thailand) పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. విమానంలో వెళ్లి రావాల్సి ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. బ్యాంకాక్, పట్టాయా లాంటి ప్రదేశాలు కవర్ చేయోచ్చు. 2022 డిసెంబర్ 8న టూర్ అందుబాటులో ఉంది. వైజాగ్ నుంచి థాయ్‌ల్యాండ్ కు ఈ టూర్ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

AP EAPCET 24: నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ 2024… విద్యార్థులకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధన

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

ఈ టూర్ మొదటి రోజు ఉదయం విశాఖపట్నం(Visakhapatnam)లో ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కాలి. అర్ధరాత్రి 1.55 గంటలకు బ్యాంకాక్ వెళ్తారు. అక్కడ నుంచి పట్టాయా(Pattaya) వెళ్లాలి. రెండో రోజు మధ్యాహ్నం నాంగ్ నూచ్ గార్డెన్ టూర్ సందర్శన చేయాల్సి ఉంటుంది. సాయంత్రం అల్కజార్ షో చూపిస్తారు. రాత్రికి పట్టాయాలో బస చేయాల్సి ఉంటుంది.

మూడో రోజు పట్టాయా సందర్శన చేయాలి. గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ మీదుగా కోరల్ ఐల్యాండ్ కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం ఇండియన్ రెస్టారెంట్‌లో లంచ్ చేస్తారు. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది.. షాపింగ్(Shopping) లాంటిది చేయోచ్చు. రాత్రికి పట్టాయాలోనే బస ఏర్పాటు చేస్తారు. నాలుగో రోజు పట్టాయా నుంచి బ్యాంకాక్ తీసుకెళ్తారు. బ్యాంకాక్ చేరుకున్న తర్వాత సఫారీ వాల్డ్ టూర్ చేయోచ్చు. రాత్రి బ్యాంకాక్‌లోనే ఉండాలి.

ఐదో రోజు బ్యాంకాక్ హాఫ్ డే టూర్ మీకోసం ఉంటుంది. గోల్డెన్ బుద్ధ(Golden Buddha), మార్బుల్ బుద్ధను సందర్శించొచ్చు. సాయంత్రం షాపింగ్ చేసుకునేందుకు సమయం ఉంటుంది. రాత్రికి తిరుగు ప్రయాణం చేయాలి. బ్యాంకాక్‌లో అర్ధరాత్రి 2.55 గంటలకు బయల్దేరితే ఆరో రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు వైజాగ్ వస్తారు. దీంతో టూర్ కంప్లీట్ అవుతుంది.

టూర్ ధరలు చూసుకుంటే..

ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్(IRCTC Thailand Tour) ప్యాకేజీ ధరలు చూసుకుంటే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999గా చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.54,999, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.63,310 నిర్ధారించారు. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, పట్టాయాలో రెండు రాత్రులు, బ్యాంకాక్‌లో ఒక రాత్రి బస, బ్రేక్‌ఫాస్ట్, 2 రోజులు డిన్నర్, లంచ్ ఉంటాయి. అంతేకాదు.. అల్కజార్ షో, స్పీడ్ బోట్‌లో కోరల్ ఐల్యాండ్, సఫారీ వాల్డ్, మెరైన్ పార్క్, హాఫ్ డే బ్యాంకాక్ టెంపుల్ సిటీ టూర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా కలిపే ఉంటాయి. పూర్తి వివరాలకు ఐఆర్‌సీటీసీ(IRCTC) అధికారిక వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.

తదుపరి వ్యాసం