తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rgv Vyooham : ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు మరో ఎదురుదెబ్బ, సస్పెన్షన్ మరో మూడు వారాలు పొడిగింపు

RGV Vyooham : ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు మరో ఎదురుదెబ్బ, సస్పెన్షన్ మరో మూడు వారాలు పొడిగింపు

22 January 2024, 13:48 IST

    • RGV Vyooham : ఆర్జీవీ వ్యూహం సినిమాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ ను మరో మూడు వారాలు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఆర్జీవీ వ్యూహం సినిమా
ఆర్జీవీ వ్యూహం సినిమా

ఆర్జీవీ వ్యూహం సినిమా

RGV Vyooham : సీఎం జగన్ రాజకీయ ప్రస్థానంపై ఆర్జీవీ దర్శకత్వం వహించిన 'వ్యూహం' సినిమాకు మరోసారి చుక్కెదురైంది. వ్యూహం సినిమా సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ మరో మూడు వారాల పాటు సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలోన అభ్యంతరక సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోపు కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. వ్యూహం సినిమాలో చంద్రబాబు పాత్రను దురుద్దేశపూర్వకంగా చిత్రీకరించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను సస్పెండ్ చేయాలని కోరారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఎఫ్ సీ జారీ చేసిన సర్టిఫికెట్ ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని వ్యూహం నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలో విడుదలకైనా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై నారా లోకేశ్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

అసలేం జరిగింది?

వ్యూహం చిత్రాన్ని గతేడాది నవంబర్‌లోనే విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో కొన్ని పాత్రలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నారా లోకేశ్ సెన్సార్ బోర్డును ఆశ్రయించారు. దీంతో ముందు సీపీఎఫ్సీ సర్టిఫికెట్ జారీకి సెన్సార్ బోర్డు నిరాకరించింది. దీంతో వ్యూహం రిలీజ్ వాయిదా పడక తప్పలేదు. ఆ తర్వాత సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఆర్జీవీ ఎక్స్ ద్వారా వెల్లడించారు. డిసెంబర్‌ 29న వ్యూహం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ... వ్యూహం సినిమా వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, సీఎం జగన్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపిస్తూ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరారు.

ఆర్జీవీ వ్యాఖ్యలు పిటిషన్ లో

చంద్రబాబు, పవన్ అంటే తనకు నచ్చరని దర్శకుడు వర్మ చేసిన వ్యాఖ్యలు, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ సంస్థ అడ్రస్ సీఎం జగన్ అడ్రస్ ఒక్కటేనని టీడీపీ, లోకేశ్ తరఫున న్యాయవాది పిటిషన్‌లో ప్రస్తావించారు. చిత్ర విడుదల ఈవెంట్ వైసీపీ నేతలు, మంత్రులు పాల్గొని చేసిన వ్యాఖ్యలను కోర్టుకు తెలిపారు. ఈ సినిమా కేవలం కొందరిపై రాజకీయ దురుద్దేశంతో తీసిందని వాదించారు. దీంతో కోర్టు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ సస్పెండ్ చేసింది. తాజాగా ఈ సస్పెన్షన్ ను మరో మూడు వారాలు పొడిగింది. మరొకసారి రివ్యూ చేసి సర్టిఫికెట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని హైకోర్టు ఆదేశించింది.

తదుపరి వ్యాసం