తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gudivada Ycp: గుడివాడ వైసీపీలో ముసలం.. తెరపైకి కొత్త అభ్యర్థి..ఊరంతా ఫ్లెక్సీల ఏర్పాటు

Gudivada YCP: గుడివాడ వైసీపీలో ముసలం.. తెరపైకి కొత్త అభ్యర్థి..ఊరంతా ఫ్లెక్సీల ఏర్పాటు

Sarath chandra.B HT Telugu

19 February 2024, 13:36 IST

    • Gudivada YCP: గుడివాడ వైసీపీలో  కొత్త అభ్యర్థి తెరపైకి రావడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. నిన్నమొన్నటి దాకా ఎదురు లేదనుకున్న కొడాలి నాని స్థానంలో కొత్త అభ్యర్ధి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
గుడివాడ వైసీపీ రేసులో కొత్త అభ్యర్ధి
గుడివాడ వైసీపీ రేసులో కొత్త అభ్యర్ధి

గుడివాడ వైసీపీ రేసులో కొత్త అభ్యర్ధి

Gudivada YCP: గుడివాడలో తిరుగు లేదనుకున్న ఎమ్మెల్యే కొడాలి నానికి Kodali Nani వైసీపీలో పోటీ తప్పేట్టు లేదు. ఇరవై ఏళ్లుగా గుడివాడలో తిరుగులేని నాయకుడిగా చలామణీ అవుతున్న నాని ఈసారి పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

వైసీపీYCP అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడటంతో గుడివాడ కొడాలి నాని ముందున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే నాని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహం వైసీపీ వర్గాల్లో కూడా ఉంది.

సర్వేలు, నివేదికలు ఆధారంగా గుడివాడలో కూడా అభ్యర్థి మార్పు ఉంటుందని పార్టీ వర్గాల్లో కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గుడివాడలో కొత్త అభ్యర్థి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి.

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు HanumanthaRaoకు సీఎం నుండి పిలుపు వచ్చిందని ఫోన్లలో వైసీపీ నేతలు మధ్య ప్రచారం జరుగుతోంది. హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపు లభించిందని ఆయన వర్గం చెబుతోంది.

మరోవైపు గుడివాడలో ఏర్పాటైన ఫ్లెక్సీలు Flexis కలకలం రేపుతున్నాయి. కొడాలి నాని స్థానంలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నా నాని వర్గం స్పందించలేదు.

దీంతో గుడివాడ వైసీపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకు ఇస్తున్నారనే ప్రచారం అక్కడ జరుగుతోంది.

హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ గుడివాడలోని ప్రధాన కూడళ్లలో బ్యానర్లను ఏర్పాటు చేసినా కొడాలి వర్గం మౌనంగానే ఉండిపోయింది. మండవ హనుమంతరావు ప్రస్తుతం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. హనుమంతరావుకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

కొడాలి నాని 2004లో తొలిసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో రెండోసారి గెలిచారు. వైఎస్సార్ మరణం తర్వాత కొడాలి నాని జగన్ వెంట నడిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీడీపీ విప్ ధిక్కరించి అనర్హతకు గురయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్నారు.

2022 మంత్రి వర్గ విస్తరణలో పదవిని కోల్పోయినా తర్వాత కీలకమైన పదవి ఇస్తామని చెప్పినా నాని దానిని తీసుకోలేదు. పార్టీ నాయకత్వం ఆదేశించిన ప్రతి సందర్భంలో టీడీపీపై దూకుడుగా విమర్శలు చేసేవారు. దీంతో వ్యక్తిగతంగా కూడా ఆ పార్టీకి లక్ష్యంగా మారారు.

తాజాగా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావొచ్చనే ఉద్దేశంతో గుడివాడలో అభ్యర్ధిని మార్చాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా నాని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించి సొంత సామాజిక వర్గానికి దూరమైన పరిస్థితుల్లో ఫలితాలు ఎలా ఉన్నా స్వీకరించడానికి సిద్ధమేనని సన్నిహితుల వద్ద నాని చెబుతున్నట్టు సమాచారం.

కొడాలి నానితో పాటు జిల్లాకు చెందిన పేర్ని నాని కూడా ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. పేర్ని నాని స్థానంలో ఆయన కుమారుడు కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోటీ చేయడంపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యర్థుల్ని తీవ్ర స్థాయిలో విమర్శించడంలో ముందున్న ముగ్గురు నాయకులు ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

తదుపరి వ్యాసం