తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancellation: పట్టాలు తప్పిన గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు రద్దు…

Trains Cancellation: పట్టాలు తప్పిన గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు రద్దు…

HT Telugu Desk HT Telugu

15 June 2023, 13:10 IST

    • Trains Cancellation: గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో  వరుసగా మూడ్రోజుల పాటు రైళ్లు రద్దుచేశారు. తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య  ఐదు గూడ్స్ బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో మూడ్రోజుల పాటు రైళ్లను రద్దుచేశారు. 
గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రద్దు
గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రద్దు (PTI)

గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్‌లో తాడి-అనకాపల్లి సెక్షన్ల మధ్య గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను రద్దు చేశారు. బుధవారం తెల్లవారు జామున బొగ్గుతో వెళుతున్న గూడ్స్ బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది.

ట్రెండింగ్ వార్తలు

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Gopi Thotakura: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రవాసాంధ్రుడు.. భూ కక్ష్య వెలుపలికి విజయవాడ యువకుడి ప్రయాణం

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

దీంతో బుధవారం పలు రైళ్లను రద్దు చేశారు.గురు, శుక్ర వారాల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.ట్రైన్ నంబర్ 12805 విశాఖపట్నం-లింగం పల్లి రైలును గురు,శుక్ర వారాల్లో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 12806 లింగంపల్లి - విశాఖపట్నం రైలును 16,17 తేదీలలో రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 17220 విశాఖపట్నం-మచిలీపట్నం రైలును 16,17 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17219 మచిలీపట్నం- విశాఖపట్నం రైలును 15,16తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17240 విశాఖపట్నం - గుంటూరు రైలును 15,16,17 తేదీలలో రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17239 గుంటూరు - విశాఖపట్నం రైలును 16వ తేదీన రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 22701 రైలును విశాఖపట్నం - విజయవాడ రైలును 16వ తేదీన రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 22702 విజయవాడ -విశాఖపట్నం రైలును 16వ తేదీన రద్దుచేశారు.

మరోవైపు నాయుడు పేట సెక్షన్‌ ట్రాఫిక్‌ మెయింటెయినెన్స్ పనుల కోసం కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.

ట్రైన్ నంబర్ 06747/06748 సూళ్లూరు పేట-నెల్లూరు రైలును గురువారం రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 22535 రామేశ్వరం బనారస్ రైలును మూడున్నర గంటల పాటు రీ షెడ్యూల్ చేశారు. ట్రైన్ నంబర్ 12712 చెన్నై సెంట్రల్-విజయవాడ రైలును రెండున్నర గంటల పాటు రీషెడ్యూల్ చేశారు.

ట్రైన్ నంబర్ 12295 బెంగుళూరు -దానాపూర్ రైలును గురువారం రెండు గంటల పది నిమిషాల పాటు రీ షెడ్యూల్ చేవారు. ట్రైన్ నంబర్ 12603 చెన్నై సెంట్రల్ హైదరాబాద్ రైలను 40నిమిషాలు, ట్రైన్ నంబర్ 17238 చెన్నై సెంట్రల్-బిట్రగుంట రైలును అరగంట, ట్రైన్ నంబర్ 12841 షాలిమార్ - చెన్నై సెంట్రల్ రైలును రెండున్నర గంటల పాటు రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు.

తదుపరి వ్యాసం