తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  8 Died In Road Accident : దైవదర్శనానికి వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

8 Died In Road Accident : దైవదర్శనానికి వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

HT Telugu Desk HT Telugu

22 November 2022, 19:47 IST

    • Road Accident : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం

అల్లూరి సీతారామరాజు(alluri sitarama raju) జిల్లాలో విషాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్లి వస్తూ.. ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద జరిగింది. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు.. ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh) వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొంతమంది భద్రాచలం(Bhadrachalam) దర్శనానికి వచ్చారు. దైవదర్శనం తర్వాత తిరుగుపయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం బొడ్డగూడెం వద్దకు వచ్చింది. ఇదే సమయంలో వేగంగా వస్తున్న లారీ బొలేరోను ఢీకొట్టింది.

దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది మృతి చెందారు. వాహనం(Vehicle)లో ఉన్న కొంతమందికి గాయాలు అయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.

తెలంగాణలోని హైదరాబాద్-బెంగళూరు(Hyderabad To Bengaluru) జాతీయ రహదారిపై సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. హైదరాబాద్(Hyderabad) నుంచి బెంగళూరుకు వెళ్తున్న మియాపూర్ కు చెందిన గరుడ బస్సు వనపర్తి జిల్లాకు చేరుకుంది. కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లికి చేరుకోగానే.. ముందుగా వెళ్తున్న చెరకు ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. దీంతో డ్రైవర్, క్లీనర్ అక్కడిక్కడే చనిపోయారు. మరో 15 మందికి గాయాలు అయ్యాయి.

గాయపడిన వారిని వెంటనే వనపర్తి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మరో ప్రయాణికుడు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 48 మంది వరకు ఉన్నారు. బలంగా ట్రాక్టర్ ను ఢీకొట్టింది బస్సు. దీంతో ముందు భాగం నుజ్జునుజ్జు అయింది.

తదుపరి వ్యాసం