తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dgp : సరిహద్దు గ్రామాల్లో నాటు సారా కట్టడికి చర్యలు…ఏపీ డిజిపి

AP DGP : సరిహద్దు గ్రామాల్లో నాటు సారా కట్టడికి చర్యలు…ఏపీ డిజిపి

HT Telugu Desk HT Telugu

13 November 2022, 22:15 IST

    • AP DGP శ్రీకాకుళం జిల్లాకు  ఒడిస్సా రాష్ట్రం తో సరిహద్దు ఉండటంతో  నాటుసారా తయారీ, గంజాయి సాగు, రవాణా జరుగుతున్నాయని మరికొన్ని నెలల్లో కఠినమైన చర్యలతో పూర్తిగా వాటికి అడ్డు కట్ట వేస్తామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన డీజీపీ ఏపీలో మద్యం  అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3400 నాటు నాటు సారా క్రయవిక్రయాలు జరిగే గ్రామాలను గుర్తించి వాటి సంఖ్యను  220 గ్రామాలుకు తగ్గించేలా కఠిన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 
శ్రీకాకుళంలో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన జిమ్‌లో డిజిపి
శ్రీకాకుళంలో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన జిమ్‌లో డిజిపి

శ్రీకాకుళంలో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన జిమ్‌లో డిజిపి

AP DGP రాష్ట్రంలో సరిహద్దు ప్రాంతంలో అక్కడక్కడ మావోయిస్టు కదలికలు ఉన్నప్పటికీ పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని డిజిపి చెప్పారు.శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయన్ని డిజిపి సందర్శించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు అధికారుల వ్యాయామశాలను ప్రారంభించారు. వ్యాయామ శాల పరికరాలను పరిశీలించి స్వయంగా కాసేపు జిమ్ ప్రాక్టీస్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

శ్రీకాకుళం జిల్లాలో నేరాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. జిల్లా లో పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా, పార్వతపురం మన్యం జిల్లాల్లో గత నాలుగేళ్లుగా నమోదైన కేసుల వివరాలు, నేరాలు జరుగుతున్న విధానం నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా హత్య ,ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాదలు వంటి నేరాలు నమోదు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. హత్యయత్నం, కొట్లాట, శారీరిక సంబంధమైన నేరాలు కొంతమేరకు పెరిగాయన్నారు.

జిల్లాలో మహిళలపై నేరాలు, గృహహింస కేసులు, పెరిగినా ప్రజలు చిన్న చిన్న విషయాలకు ఫిర్యాదు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రజల్లో అవగాహన పెరగడం వల్ల ప్రతి చిన్న సమస్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు సంఖ్య పెరిగాయని చెప్పారు. ప్రతి వారము జిల్లా ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులతో పాటు పోలీస్ స్టేషన్ స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించి కేసులతో ఇరు వర్గాల వారికి స్పందనలు వచ్చే ఫిర్యాదులపై కౌన్సిలింగ్ నిర్వహించి కేసుల సంఖ్యను తగ్గించేలా నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

దిశ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదుల ద్వారా తీవ్రమైన నేరాలు, నాటు సారా విషయంలో రెండు జిల్లాల్లో నాటు సారా తయారి ప్రదేశాలు, గ్రామాలను గుర్తించి ఆయా గ్రామలలో తరచుగా నాటుసారా తయారు చేసే వ్యక్తులను గుర్తించి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో నాట సారా క్రయవిక్రయాలు జరిగే గ్రామాలలో, ఉపాధి అవకాశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఆయా గ్రామాల్లో పాత నేరస్థులకు సుమారు 80 మందిలో గుర్తించి 27 మందికి వివిధ విభాగాలు సహకారంతో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని డిజిపి తెలియజేశారు.

శ్రీకాకుళం జిల్లా ,ఎస్సీ బీసీ కార్పొరేషన్లు డ్వామా సహకారంతో ఆయా గ్రామాల్లో ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కల్పించి నాటు సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దామని చెప్పారు. గత ఏడాదిలో 7500 ఎకరాల గంజాయి సాగును ధ్వంసం చేసి ఆయా ప్రాంతాల్లో ఇతర సాగు చేసేందుకు స్థానిక రైతులు ముందుకు వచ్చారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 169 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేసి అక్రమ రవాణా నియంత్రణ చర్యలు చేపడుతున్నామన్నారు.

రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత ఉండటంతో 6500 మంది సిబ్బంది రిక్రూట్మెంట్ కు ఆదేశాలు జారీ చేశారన్నారు. పోలీస్ సిబ్బంది హోమ్ గార్డుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని, పోలీస్‌ ఉద్యోగాల నియామకాల్లో ప్రాధాన్యత కల్పించినట్లు చెప్పారు.

తదుపరి వ్యాసం