తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ramachandra Yadav : మంత్రి పెద్దిరెడ్డి రూ.35 వేల కోట్ల అవినీతి, అమిత్ షాకు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు

Ramachandra Yadav : మంత్రి పెద్దిరెడ్డి రూ.35 వేల కోట్ల అవినీతి, అమిత్ షాకు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు

01 August 2023, 20:54 IST

    • Ramachandra Yadav : మంత్రి పెద్దిరెడ్డి రూ.35 వేల కోట్లు దోచుకున్నారని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈడీ ద్వారా దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
రామచంద్ర యాదవ్
రామచంద్ర యాదవ్

రామచంద్ర యాదవ్

Ramachandra Yadav : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్రమంత్రిని రామచంద్రయాదవ్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు చేస్తున్నారని, సుమారు రూ.35 వేల కోట్ల అవినీతిపై ఆధారాలతో అమిత్ షాకి ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగేళ్లలో రూ.35 వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులున్నాయన్నారు. 17 మంది డైరెక్టర్ల ద్వారా సూట్ కేసు కంపెనీలు సృష్టించి అవినీతిని దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2019 ముందు ఉన్న ఆస్తుల వివరాలు పెద్దిరెడ్డి దాచిపెట్టారని తెలిపారు. ఈ విషయంలో పెద్దిరెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు రామచంద్ర యాదవ్ చెప్పారు. ఈడీ ద్వారా దర్యాప్తు జరిపి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మోసం చేశారని, భవిష్యత్‌లో న్యాయపోరాటం చేస్తానని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

రామచంద్రయాదవ్ కొత్త పార్టీ

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌ ఇటీవల రాజకీయ పార్టీ స్థాపించారు. భారత చైతన్య యువజన పార్టీ (BCYP) పేరుతో నూతన రాజకీయ పార్టీ నెలకొల్పారు. గుంటూరులో ఇటీవల భారీ బహిరంగ సభ నిర్వహించిన రామచంద్రయాదవ్‌.. కొత్త పార్టీ పేరు ప్రకటించారు. ఈ సభలో రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంతో బీసీవైపీ స్థాపించినట్టు తెలిపారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కొత్త రాజకీయ ప్రస్థానం జరగాలని సూచించారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. సీఎం జగన్ పాలన పురాణాల్లో రాక్షసుల్ని గుర్తు చేస్తుందని మండిపడ్డారు.

తదుపరి వ్యాసం