తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Michaung Crop Loss: కృష‌్ణాలో లక్ష హెక్టార్లలో పంట నష్టం, వందల కిలోమీటర్ల రోడ్ల ధ్వంసం

Michaung Crop loss: కృష‌్ణాలో లక్ష హెక్టార్లలో పంట నష్టం, వందల కిలోమీటర్ల రోడ్ల ధ్వంసం

Sarath chandra.B HT Telugu

14 December 2023, 6:20 IST

    • Michaung Crop loss: మిగ్‌జామ్‌ తుఫాను ఏపీలో అపార నష్టాన్ని సృష్టించింది. ప్రాథమిక అంచనాల్లో ఒక్క కృష్ణాజిల్లాలోనే పంట నష్టం రెండున్నర లక్షల ఎకరాలను దాటిపోయింది. ఇప్పటికీ పంట పొలాల్లో నీరు నిలిచి ఉండటంతో నష్టాన్ని అంచనా వేయడంలో జాప్యం జరుగుతోంది. 
పొలాల్లో పాడైపోయిన వరి పంటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
పొలాల్లో పాడైపోయిన వరి పంటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

పొలాల్లో పాడైపోయిన వరి పంటను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

Michaung Crop loss: ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాథమిక అంచనాల్లో కృష్ణాజిల్లాలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో తుఫాన్ పంట నష్టం పరిశీలించిన కేంద్ర బృందం రైతులను పరామర్శించింది. కోస్తాలో తుఫానుతో అపార నష్టం వాటిల్లితే రాయలసీమలో వర్షాలు లేక భారీ నష్టం వాటిల్లింది.ఈ ఏడాది ఏపీలో రైతులకు కడగండ్లు మిగిలాయి.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

రాష్ట్రంలో తుఫాను, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ బృందం పంట నష్టాన్ని అధ్యయనం చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ ,ఐఏఎస్ న్యూఢిల్లీ నేతృత్వంలో బృంద సభ్యులు పలు ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు 1,01,862 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, 913.62 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించారు. ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 312.23 కి.మీ. మేరకు 57 రహదారులు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 17.16 కి.మీ. మేరకు 6 రహదారులు దెబ్బతిన్నాయని జిల్లా జేసి కేంద్ర బృందానికి వివరించారు.

కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో రైతు సాంబశివరావు పొలంలో పనలపై పడిపోయిన వరి పంటను చూశారు. వర్షం నీటిలో పంట ఒరిగిపోవడం చేత తీవ్రంగా నష్టపోయానని ఆ రైతు కేంద్ర బృందం వద్ద ఆవేదన వ్యక్తం చేశాదు. తనను ఆదుకోవాలని ఆ రైతు కేంద్ర బృందం వద్ద మొరపెట్టుకున్నాడు.

అనంతరం పామర్రు మండలం నిమ్మలూరు గ్రామంలో ఆత్మూరి రామ కోటేశ్వరరావు తాను 20 ఎకరాల కౌలు రైతునని కేంద్ర బృంద సభ్యులకు తెలిపాడు తర్వాత గుడివాడ మండలంలో రామనపూడి గ్రామానికి వెళుతూ, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరపెట్టుకుంటున్న రైతు గొరిపర్తి వెంకటేశ్వరరావుతో మాట్లాడారు. గత నాలుగు రోజుల నుంచి వస్తున్న ఎండను బట్టి వడ్లలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు ఆరబెట్టుకున్నానని రేపు రైతు భరోసా కేంద్రానికి ధాన్యం లోడు తీసుకు వెళ్తున్నానని రైతు తెలిపారు.

అక్కడే దెబ్బతిన్న వరి పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించి రైతులతో ముఖాముఖి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు వరిపంట ఎక్కువగా చేతికి వచ్చే దశలో దెబ్బతిందని పలువురు రైతులు కేంద్ర బృంద సభ్యుల వద్ద మొరపెట్టుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

పంట నష్టం అంచనాలు రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేమని, తొలి రోజున కృష్ణాజిల్లాలో బుధవారం పర్యటిస్తున్నామని చెప్పారు. తాము పర్యటించిన పలు ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచి ఉన్నందున జిల్లా యంత్రాంగం ఇప్పటికే పంట నష్టం అంచనా వేయడానికి ఎన్యుమురేషన్ చేపట్టిందని ఆ ప్రక్రియ పూర్తయ్యాక సరైన పంట నష్ట అంచనాలు అందుతాయని దాని ఆధారంగా సంపూర్ణ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, నష్టపోయిన రైతులను నిబంధనల మేరకు ఆదుకోవాలని తాము సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు.

పంటనష్టం జరిగిన రైతులందరికీ నష్టపరిహారం అందజేయడానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరుగుతుందనిఇంటర్ మినిస్ట్రీయల్ సెంట్రల్ టీం ప్రతినిధి పి. దేవేంద్రరావు పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో పరిగి మండలం లోని మోద గ్రామంలోపూట గారి పల్లి, మడకశిర నియోజక వర్గం బుళ్ళ సముద్రం గ్రామము లో వేరుశనగ కంది, పంటలను క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు.

శ్రీ సత్య సాయి జిల్లాలో ఈ ఏడాది కరువు వల్ల 73,566 హెక్టర్ లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు రిపోర్ట్ పంపడం జరిగిందన్నారు. ఇందులో వేరుశనగ, మొక్కజొన్న, కంది, రాగి మరియు ప్రత్తి పంటలకు నష్టం వాటిల్లిందని ఇందులో ఎక్కువగా వేరుశెనగ మరియు మొక్కజొన్న పంట నష్టం జరిగినట్లు గుర్తించడం జరిగిందన్నారు.

తదుపరి వ్యాసం